ఇండస్ట్రీయల్ పార్క్ భూసేకరణపై వివాదం ఉన్నతస్థాయి దర్యాప్తునకు బీఆర్‌ఎస్ డిమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రగతిని అడ్డుకుంటున్నారంటున్న బీజేపీ
సాక్షి,ఆదిలాబాద్: ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణ చుట్టూ జిల్లాలో రాజకీయం కొనసాగుతుంది. దీనిపై ఉన్నతస్థాయి చట్టపరమైన దర్యాప్తు జరపాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంజయ్ జాజుకు తాజాగా వినతిపత్రం అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భూసేకరణలో వివాదాలు ఉన్నాయని, ఆర్థిక అంశాల అక్రమాలతో కూడుకొని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం కలిగిస్తుంది. ఈ వ్యవహారంలో జిల్లా కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. మరోవైపు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బీజేపీ ఘాటుగా విమర్శిస్తుంది. ఇక భూములు కోల్పోతున్న రైతులు రూ.40లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో ఈ ఇండస్ట్రీయల్ కారిడార్ భూ సేకరణ చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి.
కొనసాగుతున్న సర్వే..
జిల్లాలోని భోరజ్ మండలం హత్తిఘాట్, గూడ, రాంపూర్, గిమ్మ గ్రామాల పరిధిలోని 2062 ఎకరా లు ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం భూసేకరణ చే యనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలి సిందే. నోటిఫికేషన్, గ్రామసభలు పూర్తయ్యాయి. సర్వే కొనసాగుతుండగా, ప్రస్తుతం ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు పొలిటికల్ హీ ట్ పెంచాయి. బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్‌పై బీఆర్‌ఎస్ గురిపెట్టింది. ఈ అంశంలో కాంగ్రెస్‌తో ఎమ్మెల్యే అంటకాగుతున్నట్లుగా ఆరోపిస్తోంది. ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేతతో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తూ జిల్లాలో భూ సేకరణ పరంగా అక్రమాలకు పాల్పడుతున్నారని గులాబీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపిస్తున్నారు.
దృష్టి మళ్లించేందుకే..
జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఇందులో ఎమ్మెల్యే శంకర్‌కు సంబంధాలున్నాయని బీఆర్‌ఎస్ ఆరోపణలు సంధిస్తోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎమ్మెల్యే శంకర్ కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. ఉన్నట్టుండి ఆయనకు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శిస్తోంది. పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు పాదయా త్ర చేస్తామనడం ఇదే కోవలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా కారిడర్ రాజ కీయం ప్రస్తుతం జిల్లాలో ఆసక్తి కలిగిస్తోంది.


