బోథ్: ఒటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన మంగళవారం పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘సర్’ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుభాష్‌చందర్, ఎంపీడీవో రమేశ్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, శ్రీధర్‌రెడ్డి, సురేందర్ యాదవ్, సర్పంచ్ రవీందర్, ఉపసర్పంచ్ సంతోష్, వీడీసీ చైర్మన్ పోతన్న, బాబులాల్, రాజు, సుభాష్, రమణగౌడ్, ప్రశాంత్, రఫీ, సంజీవ్, బాపురెడ్డి, వినయ్, తదితరులున్నారు.


