
రాష్ట్రస్థాయి పోటీల్లో మనోళ్ల సత్తా
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటారు. మహబూబ్‌నగర్ వేదికగా గురువారం ప్రారంభమైన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో మూడు పతకాలు కై వసం చేసుకున్నారు. రేస్ వాక్ విభాగంలో అండర్–20లో అడ్డం జస్వంత్, అండర్–18 విభాగంలో మేడి అన్వేష్ రజత పతకాలతో మెరువగా.. రాథోడ్ రషిక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు శిక్షకులు వీజీఎస్ రాకేశ్, అరుణ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడంపై డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, పెటా అధ్యక్షుడు పా ర్థసారథి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.