
పోక్సోపై అవగాహన అవసరం
కై లాస్‌నగర్: పో క్సో చట్టంపై ప్ర జల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం విలేకరుల సమావేశంలో పోక్సో చట్టం వివరాలను వెల్లడించారు. ఈ కేసుల్లో విచారణ తీరు, నిబంధనలు, శిక్షల అమలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ కొనివ్వకూడదని, అలాగే వారి మానసిక స్థితి, ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. చట్టంపై అవగాహన కలిగి ఉన్నట్‌లైతే లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.