
ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు
ఆదిలాబాద్: ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవాడతాయని 32 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వీపీ సింగ్ అన్నారు. ఎన్‌సీసీ కేడెట్లకు ఆగస్టు 28న ప్రారంభమైన సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆదివారం పోలీస్ శిక్షణ కేంద్రంతో పాటు, తలమడుగు మండలం సుంకిడిలో వారికి ఫైరింగ్‌పై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కల్నల్ మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 6వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో రజిత, అశోక్, ప్రశాంత్, భూమన్న, ఆనందరావు, శ్రీనివాస్, వినోద్, స్వామి, రాజేశ్వరి, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.