
‘స్వచ్ఛంద’ దందా
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అనధికార వ్యాపారానికి రంగం సిద్ధమవుతోంది. స్వచ్ఛంద సేవ ముసుగులో ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా షెడ్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా ఆస్పత్రి ఆవరణలో ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించా లన్నా.. రిమ్స్ అధికారుల అనుమతి తప్పనిసరి. పోటీ ఉంటే టెండర్లు పిలిచి అర్హులైన వారికి కేటా యించాలి. అయితే ఇవేమి పాటించకుండా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అక్రమంగా షెడ్‌ను ఏర్పా టు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఓ అధికారి మౌఖిక అనుమతితోనే తాను షెడ్‌ను ఏర్పాటు చేసినట్లు సదరు సంస్థ ప్రతినిధి ప్రచారం చేసుకుంటుండం గమనార్హం. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.