అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Sep 2 2025 7:32 AM | Updated on Sep 2 2025 7:34 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● ప్రజావాణికి 84 దరఖాస్తులు

కై లాస్‌నగర్‌: ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు సాంత్వన చేకూర్చాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్‌ సలోనితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 84 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..

రోడ్డు కష్టాలు తీర్చండి

మా గ్రామానికి వెళ్లే రోడ్డు పొచ్చెర నుంచి అధ్వానంగా మారింది. రూ.17కోట్ల వ్యయంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ కంకర వేసి మధ్యలోనే వదిలేశాడు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – కప్పర్ల గ్రామస్తులు, తాంసి

గిట్టుబాటు కావడం లేదు..

మేము జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో విద్యార్థులకు ఆరేళ్లుగా భో జనం వండి వడ్డిస్తున్నాం. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.7.20 మాత్రమే చెల్లిస్తోంది. మాకు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం ఇటీవల నూతన మెనూ ప్రకటించినా ధర మాత్రం పెంచలేదు. దీంతో ఇబ్బందులకు గురవుతున్నాం. నూతన మెనూ ప్రకారం రూ.9.40 చొప్పున చెల్లించాలని కోరుతున్నాం. – వసతి గృహాల కేటరింగ్‌ నిర్వాహకులు

పరిహారం అందించండి

ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరంతా మా ఇళ్లలోకి చేరింది. నిత్యావసర సరుకులతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా తడిసి తీవ్రంగా నష్టపోయాం. అధికారులు సర్వే చేసి మా వివరాలు తీసుకున్నప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదు. త్వరగా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాం.

– వరద బాధితులు, మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్‌

మా ఇబ్బందులు గుర్తించండి

మేమంతా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని పీహెచ్‌సీల పరిధిలో క్షేత్రసాయిలో పనిచేసే సీహెచ్‌వో, ఎంపీహెచ్‌ఈవో, పీహెచ్‌ఎన్‌, ఎంపీహెచ్‌ఎస్‌ ఉద్యోగులం. మాకు ఆధార్‌ బెస్డ్‌ అటెండెన్స్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో 4నుంచి 5 సబ్‌సెంటర్లు ఉన్నాయి. పీహెచ్‌సీకి వెళ్లి అటెండె న్స్‌ నమోదు చేసి ఫీల్డ్‌కు వెళ్లాలంటే 40నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది ఇబ్బందిగా మారుతుంది. మాకు ఆధార్‌ బేస్డ్‌ హాజరు నుంచి మినహా యించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు1
1/4

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు2
2/4

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు3
3/4

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు4
4/4

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement