
మిస్ & మిసెస్ బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే సీజన్ -2 వేడుక గ్రాండ్ ఫినాలే సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో సోమవారం(సెప్టెంబర్ 1, 2025) జరిగింది. యువతులతో పాటు వివాహిత మహిళలు వయ్యారాల నడకలతో కనువిందు చేశారు.

వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడ్డారు.

బెలెజా అనేది ఒక అందాన్ని ప్రదర్శించే వేదిక మాత్రమే కాదు.

ఇది అవకాశాలను కల్పించే, నేర్చుకునే, నేర్చుకున్న విషయాలను అమలు చేయడంలో సహాయపడే శక్తివంతమైన వేదిక అని వక్తలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.













