
కూటమి పాలనలో.. రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీనీ, మినుము ఇలా ఏ రైతు కూడా ధరలు లేక అల్లాడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన్ని తాళ్లపల్లి రైతులు కలిసి తమ గోడును వెల్లగక్కారు.

పొలంలోకి దిగి పంటలను స్వయంగా పరిశీలించిన ఆయన.. రైతులను ఓదార్చారు. గిట్టుబాటు ధర లేక.. కూలీ డబ్బులు సైతం రాక రైతులు అల్లాడిపోతున్నారు. ఇంకోవైపు.. యూరియా కొరతతో రైతులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలే కమీషన్ల కోసం బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నారు అని జగన్ ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర ఇచ్చి ఉల్లి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి బయటి మార్కెట్లో కేజీ రూ.6కి కొనుగోలు చేస్తున్నారని.. హెరిటేజ్ కేజీ ఉల్లి రేటు రూ.35 చేసి అమ్ముతున్నారని మండిపడ్డారు.





