
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రతీ ఫిర్యాదును స్వీకరిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. స్థానిక పోలీ సు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి న 23 మంది ఎస్పీకి అర్జీలు సమర్పించారు. అనంతరం ఆయన సంబంధిత పోలీసు అధికా రులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సమస్యలు, కుటుంబ కలహాలు, కేసుల దర్యాప్తు, పురోగతి వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదు ల విభాగం అధికారి కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆకతాయిలపై షీటీం ప్రత్యేక దృష్టి
మహిళల భద్రత కోసం షీటీం పనిచేస్తుందని, ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి సమయాల్లో ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షీటీంలు రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు పేర్కొన్నారు. యు వతులు, విద్యార్థినులు ఆపత్కాల సమయంలో 87126 59953 నంబర్‌పై షీటీంను సంప్రదించాలని సూచించారు.