
వేతనాలు చెల్లించాలని నిరసన
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే వేతన బకాయిల విడుదలతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ కార్మికుల ఖాతాల్లో జమ చే యాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన టెండర్లు పిలవాలని, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి అమలు చేయాలని పేర్కొన్నా రు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఇందులో సంఘం నాయకులు పొచ్చన్న, సుమన్, దశాంత్, కె.రమేశ్, రాజ మణి తదితరులు పాల్గొన్నారు.