
జానపద సంబరాల్లో బాలకేంద్రం చిన్నారులు
ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ప్ర పంచ జానపద దినోత్సవ సంబరాల్లో బాలకేంద్రం చిన్నారులు పాల్గొని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భాషా సాంస్కృతిక శాఖ, సారిపెల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో చి న్నారులు ఎల్లమ్మ బోనాల పాటపై నర్తించి ఆకట్టుకున్నారు. వీరి ప్రదర్శనకు ముగ్ధులైన నిర్వాహకులు చిన్నారులు, బాలకేంద్రం శిక్షకుడు, సూపరింటెండెంట్ మిట్టు రవిని జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ.రమణాచారి, జానపద కళా కారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, చుంచు లింగన్న, మహిళా విభాగం ప్రతినిధులు కవిత, విజయలక్ష్మి పాల్గొన్నారు.