
హాకీ అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే చాలామంది హాకీ క్రీడాకారులు క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. ఎంపీ నగేశ్ సహకారంతో ఆస్‌ట్రో టర్ఫ్ మైదానం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ హాకీ జట్ల మధ్య స్నేహపూర్వక హాకీ పోటీలను నిర్వహించారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఇందులో అసోసియేషన్ కోశాధికారి డేవిడ్ రాజు, రవీందర్, అశోక్, శ్రీనివాస్, గోవింద్, శేఖర్, విజయ్, కిరణ్, అరుణ్, రామ్‌కుమార్, చిట్టి తదితరులు పాల్గొన్నారు.