
‘వేసవి’ పనులపై విచారణ
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వేస వి నీటి ఎద్దడి నివారణకు రూ.37.73 లక్షలతో చేపట్టిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. సీజన్ ముగిసే క్ర మంలో పనులు చేపట్టడం, పారదర్శకత పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందులో భాగంగా రూ.18లక్షల స్ట్రీట్ వెండర్స్ షెడ్ల నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు ఆ పనులు చేయకుండానే మరో టెండర్ అప్పగించడాన్ని అందులో ప్రస్తావించిన విష యం తెలిసిందే. ఈ పనుల్లో అక్రమాలపై కలెక్టర్ రాజర్షిషా ఇటీవల సీరియస్ అయ్యారు. విచా రణకు ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ ఏఈ రమేశ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ క్రమంలో ఏఈ సోమవారం మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. పనుల ప్రగతి, అగ్రిమెంట్లు, ఎంబీ రికార్డులు వంటి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, మున్సిపల్ ఇంజినీర్ అందుబాటులో లేకపోవడంతో మరోసారి వచ్చి విచారణ చేస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు పూర్తిస్థాయి నివేదిక అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘వేసవి’ పనులపై విచారణ