
భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్‌టౌన్: సైన్స్‌పై విజ్ఞానం పెంపొందించుకుని విద్యార్థులు భావితర శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా సైన్స్ అధికారి ఆరె భా స్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో గల సరస్వతి శిశుమందిర్‌లో విభాగ్ స్థాయి గణిత మేళా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, విద్యార్థులు సైన్స్‌లో రాణించేలా మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఇందులో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రఘురమణ, శిశుమందిర్ ప్రతినిధులు శ్రీనివాస్, బజరంగ్ అంగర్వాల్, హన్మాండ్లు, సుహాసినిరెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.