మంచిర్యాలలో పెరగనున్న స్లాబ్ రేట్..
నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్న ఎకై ్సజ్‌శాఖ ఉమ్మడి జిల్లాలో వైన్స్‌ల సంఖ్య మారట్లే.. అంతగా నడవని షాప్‌లు మాత్రం రీలొకేషన్?
సాక్షి,ఆదిలాబాద్: వైన్‌షాపుల టెండర్ నోటిఫికేషన్ కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏర్పాట్లపై ఎక్సైజ్ శా ఖ దృష్టి సారించింది. ఈ సారి ఉమ్మడి జిల్లాలో వైన్స్‌ల సంఖ్యలో మార్పు ఉండకపోవచ్చని తెలు స్తోంది. అయితే మంచిర్యాలలో స్లాబ్‌రేటు పెరగనుండగా.. అంతగా నడవని షాపులను మాత్రం రిలొకేషన్ చేయనున్నట్లు సమాచారం.
రీ లొకేషనన్‌కు అవకాశం..
వైన్‌షాపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన స్లాబ్ రేటు అమలు చేస్తారు. ఈ ప్రకారం ఏటా ఆ విలువ కంటే పది రేట్లకు పైగా ఎక్కువ విక్రయాలు జరిగితే ఆ షాపును మంచి ఆదాయం ఉన్నట్లుగా పరిగణిస్తారు. అయితే జిల్లాలో కొన్ని వైన్స్‌ల ఆదా యం తక్కువగా ఉండటంతో వాటిని మరో చోటికి తరలించాలని ఎకై ్సజ్‌శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలవారీగా రీలొ కేషన్ జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో..
ఎకై ్సజ్‌శాఖ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఆదిలా బాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఇవి పని చేస్తాయి. జిల్లాల్లో డీపీఈవోలు అధికారులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కొత్త ఎకై ్సజ్ పాలసీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధి విధానాలన్నింటినీ ఆ శాఖ పూర్తి చేసింది. ప్రభుత్వం ఎప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినా అందుకు రెడీగా ఉంది.
అదే సంఖ్యలో వైన్స్‌లు..
ఉమ్మడి జిల్లా పరిధిలో గత ఎకై ్సజ్ పాలసీలో ఉన్న వైన్స్‌ల సంఖ్య ఈ సారి మారకపోవచ్చని తెలుస్తోంది. అయితే అంతగా నడవని వైన్స్‌లను రీలొకేషన్ పేరిట అదే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆదా యం లేని వైన్స్‌లను ఎకై ్సజ్ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. టెండర్ నోటిఫికేషన్‌కు ముందు ప్రభుత్వం వీటిపై పరిశీలన జరపనుంది. వాటిని రీలొకేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన పక్షంలో ఎక్కడికి మార్చాలి అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా శాఖ అధికారులు రీలొకేషన్ కోసం పరిశీలన కూడా చేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి.
ఉమ్మడి జిల్లాలో వైన్స్‌ల సంఖ్య..
జిల్లా వైన్స్‌ల సంఖ్య
ఆదిలాబాద్ 40
నిర్మల్ 47
మంచిర్యాల 73
కుమురంభీం ఆసిఫాబాద్ 32
మొత్తం 192
విధివిధానాలు ఖరారు కాలేదు..
ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో విధివిధానాలు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఆ తర్వాతే కొత్త ఎకై ్సజ్ పాలసీపై స్పష్టత వస్తుంది. రీలొకేషన్ విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే వెళ్లడం జరుగుతుంది.
– కె.రఘురాం, డిప్యూటీ కమిషనర్,
ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్ డివిజన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గత ఎక్సైజ్ పాలసీలో మూడు స్లాబ్ రేట్లు అమలులో ఉన్నాయి. రూ.60 లక్షలు, రూ.55 లక్షలు, రూ.50 లక్షలు జనాభా ప్రాతిపదికన ఇప్పటివరకు కొనసాగాయి. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్ కావడంతో నూతన పాలసీలో అక్కడ స్లాబ్ రేటు రూ.65 లక్షల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎకై ్సజ్ శాఖ విధివిధానాలు రూపొందించినట్లు సమాచారం. నిర్మల్, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పాత విధానాల్లోనే స్లాబ్ రేట్లు కొనసాగనున్నా యి. ఇదిలా ఉంటే గతంలో టెండర్ దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా, ప్రభుత్వం ఈ సారి రూ.3లక్షలకు పెంచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా, వాటి తర్వాతే వీటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ శాఖలో ప్రచారం సాగుతుంది.
మంచిర్యాలలో పెరగనున్న స్లాబ్ రేట్..


