కైలాస్‌నగర్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధా నం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి టీఎన్జీవోస్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సంద అశోక్ మాట్లాడుతూ.. సీపీఎస్ అమలుతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మే నిఫెస్టోలో ప్రకటించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సెక్రెటరీ జనరల్ కె.శివకుమార్, కోచైర్మన్ కె.కిష్టన్న, జేఏసీ బాధ్యులు ఎ.నవీన్‌కుమార్, సోగాల సుదర్శన్, నవీన్ యాదవ్, బెజ్జంకి రవీంద్ర, లక్ష్మారెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్ ని ర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశ్ మా ట్లాడుతూ ఏడేళ్ల క్రితం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఎకరాకు రూ.8లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం భూమి విలువ పెరిగినందున పరిహారాన్ని రెట్టింపు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విషయాన్ని ప్రస్తావించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కిరణ్, మంజూల, స్వామి, తదితరులు పాల్గొన్నారు.


