
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ వి.ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1న ఐడీవోసీ కా ర్యాలయంలో ని ర్వహించే సభను విజయవంతం చేయాలని కో రారు. 2004 సెప్టెంబర్1 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ ఉ ద్యోగులు కలెక్టరేట్‌లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, గెజిటెడ్ ఉ ద్యోగుల సంఘం కార్యదర్శి రమేశ్, ఉ పాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు మురళీమనోహర్‌రెడ్డి, జుట్టు గజేందర్, రవికాంత్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, అశోక్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రవి, గణేశ్ పాల్గొన్నారు.