
ఫొటోలతో జ్ఞాపకాలు పదిలం
ఆదిలాబాద్: ఫొటోలతో జ్ఞాపకాలు పదిలంగా నిలి చిపోతాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ఫొటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, విజ య్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, హరికృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, అనిల్, మురళీధర్, సంతోష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.