
పారదర్శక నివేదిక అందించాలి
శాఖల వారీగా సర్వే పకడ్బందీగా చేపట్టాలి నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు అధికారులతో సమీక్షలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’
కై లాస్‌నగర్: వరదలతో నష్టపోయిన బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా సమగ్ర సమాచా రంతో కూడిన పారదర్శక నివేదిక అందించాలని జి ల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించా రు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహా యక చర్యలపై జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వా రీగా జరిగిన నష్టంపై అధికారులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. పంటనష్టం, మూగజీవాలు, ధ్వంసమైన ఇళ్ల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నష్టాలను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించాలని, ఇందుకు అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలన్నా రు. ఏమైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధి కారులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. న ష్టంపై శాఖల వారీగా సమీక్షించి పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి, నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లుపడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌పై అసంతృప్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు ప్రారంభించకపోవడంపై అధికారులు చెప్పి న సమాధానాలపై ఆయన విబేధించారు. మంజూరై ఇళ్ల నిర్మాణం చేపట్టని వారితో ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక స్థోమత లేకనే చేపట్టకపోతే బ్యాంకులు, ఎస్‌హెచ్‌జీల ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్, బోథ్, ఖానా పూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రికి కలెక్టర్, ఎస్పీలు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలి కారు. పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
ఈ ఏడాది మే 27న జైనథ్ మండలం లక్ష్మింపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు తర్నం వాగు దాటుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ.5లక్షల చెక్కును మృతుడి భార్య జ్యోతికి మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో వరద ప్రభావానికి కూలిపోయిన ఇళ్లు, భారీగా ప్రవహించిన నాలాను మంత్రి పరిశీలించారు. 11 మంది బాధితులకు రూ.4వేల నగదు, 10 కిలోల సన్నబియ్యం చొప్పున మంత్రి అందజేశారు.