
సమష్టి కృషితోనే తాగునీటి సమస్య పరిష్కారం
నార్నూర్: మండలంలోని సుంగాపూర్ గ్రామంలో అందరి సహకారంతోనే తాగునీటి సమస్య పరిష్కారమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పంచాయతీ పరిధిలోని గొండుగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన బావితో పాటు పైపులైన్, వాటర్ ట్యాంకులను ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాతో కలిసి బుధవారం ప్రారంభించారు. నీటి సమస్య శాశ్వత పరి ష్కారం కోసం ఐటీడీఏ ద్వారా కొంత నిధులు, కలెక్టర్‌గా తాను కొంత నిధులు సమకూర్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతితో పని సులభమైందన్నారు. అనంతరం గ్రామస్తులతో కలి సి భోజనం చేశారు. చిత్తగూడ సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నార్నూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కలెక్టర్ వెంట డీఎఫ్‌వో బాజిరావ్ పాటిల్, ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, రాయి సెంటర్ జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు పటే ల్, డీఈఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీఈఈ శివప్రసాద్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఎంఈవో అనిత, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు దాదిరావు, తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
ఇంద్రవెల్లి: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. బుధవారంమండలకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణా లను తనిఖీ చేశారు. ఎరువుల గోదాంలను పరిశీ లించారు. రైతులతో మాట్లాడి ఎరువులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ అధికారి రాథోడ్ గణేశ్ తదితరులున్నారు.
వరద నష్టంపై తక్షణ సర్వే
కైలాస్‌నగర్: వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు తక్షణ సర్వే నిర్వహించి నష్టం అంచనాలతో కూడిన నివేదికలు పక్కాగా సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టి త్వరితగతిన రాకపోకలు పునరుద్ధరించాలన్నారు. సర్వే సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు శాశ్వత పరి ష్కారానికి మండల,జీపీల వారిగానివేదికలు అందించాలని తెలిపారు. ఈ సర్వేపై సూపర్ చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా, అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.