
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నేరడిగొండ: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసున్న ఘ టన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (37) మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఏడాది క్రితం తిరిగి వచ్చాక తనకున్న అర ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని పత్తి సాగు చేపట్టాడు. అయితే గతేడాది సరైన దిగుబడి రాలేదు. ఈ సారి మళ్లీ పత్తి సాగు చేయగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట పూర్తిగా నీట మునిగింది. గతంలో దుబాయ్ వెళ్లేందుకు, వచ్చాక సాగు కోసం చేసిన అప్పు (ప్రైవేట్‌లో) మొత్తం రూ.5లక్షల వరకు చేరింది. ఈ క్రమంలో అది ఎలా తీర్చాలో తెలియ క మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుమలత ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు.