
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. రిమ్స్‌లో యాంటీ ర్యాగింగ్‌పై మెడికోలకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంబీబీఎస్ సీటు కోల్పోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవుతాయని, అలాగే జైలు, జరిమానాలు త ప్పవన్నారు. సీనియర్లు జూనియర్ల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 5522 కు సమాచారం అందించాలన్నారు. అలాగే రిమ్స్ డైరెక్టర్‌తో పాటు మెంట ర్‌కు సైతం సమాచారం అందించవచ్చని పే ర్కొన్నారు. అంతకుముందు ఎన్‌ఆర్‌సీతో పా టు రిమ్స్‌లోని పలు వార్డులను పరిశీలించారు. ఆమె వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు విద్యావిల్సన్, సరో జ, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, కరుణాకర్, రఘునాథ్‌రావు, మెడికోలు పాల్గొన్నారు.