
ఇది జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీ. దస్నాపూర్ వ
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు మురికి వాడల్లో వరద ప్రభావం కనిపించేది. అయితే అక్కడ సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడమే కారణం. ఇప్పుడు మా త్రం పలు కొత్త కాలనీల్లోనూ ఇళ్లు నీట మునగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రధానంగా రెండు దశాబ్దాలుగా కొత్త లేఅవుట్లలో విస్తృతంగా భవనాల నిర్మాణాలు అవుతున్నాయి. అటువంటి చోటే వరదలు చుట్టుముట్టడం విస్తుగొలుపుతోంది. అ లాంటిదే సుభాష్‌నగర్. దీంతోపాటు మణిపూర్ కా లనీ, ఖోజా కాలనీ, గ్రీన్‌సిటీ, జీఎస్ ఎస్టేట్.. ఇలా పలు భవంతులు ఉన్న కాలనీల్లో మొదటి అంతస్తు పూర్తిగా మునిగేలా వరదలు రావడం గమనార్హం.
కబ్జాల నేపథ్యంలోనే..
జిల్లా కేంద్రంలోని పలు చెరువులు, వాగుల సమీ పంలో బఫర్ జోన్‌లో నిర్మాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇష్టారీతిన స్థలాలను కబ్జా చేశారు. భవనాలను నిర్మించారు. డూప్లెక్స్‌ల నిర్మాణాలు కూడా ఉన్నా యి. భారీ వర్షం కురిసినప్పుడు ఈ బఫర్ జోన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షానికి గ్రీన్ సిటీని వరదలు ముంచెత్తాయి. తాజాగా కురిసిన వర్షాలతో దీంతోపాటు ఇతర కొత్త కాలనీల్లోనూ ఇదే తరహా వరదలు చుట్టుముట్టడం వెనుక కబ్జాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా డ్రెయినేజీ వ్యవస్థను ఇష్టారీతిన కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో వర ద నీరు పారేందుకు కూడా సరైన వ్యవస్థ లేక ఇళ్లలోకి చేరుతోంది. ఈ వరదలను అంచనా వేసి కబ్జాలను తొలగిస్తేనే రానున్న రోజుల్లో ఇలాంటి ముప్పు తలెత్తదన్న అభిప్రాయం పట్టణవాసుల్లో వ్యక్తమవుతుంది.
నేటి నుంచి సర్వే..
పట్టణంలోని కాలనీల్లో ఈ వరదలెందుకు వచ్చా యి.. కారణం ఏమిటి.. డ్రెయినేజీలు లేవా.. ఉంటే ఎందుకు పొంగాయి.. లేనిపక్షంలో డ్రెయినేజీలు క బ్జాకు గురయ్యాయా.. పూడిక తియ్యలేదా.. వీటిని కబ్జా చేసి నిర్మాణాలు కట్టారా.. దీనిపై ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా బృందాలుగా ఏర్పాటు చేసి గురువారం నుంచి సర్వే చేయనున్నారు. ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు. దీంతో ఇప్పుడు ఆయా కాలనీల్లో వరదలకు కారణమేమి టనే చర్చ మొదలైంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తా యా.. హైడ్రా వంటి సంస్థలను రంగంలోకి దించుతారా.. లేనిపక్షంలో కబ్జాల విషయంలో ఎలాంటి చర్యలకు దిగుతారోననే దానిపై చర్చగా సాగుతోంది.
నీట మునిగిన కాలనీలు..
జిల్లా కేంద్రంలో ఖానాపూర్, అంబేద్కర్‌నగర్, సుభాష్‌నగర్, కోలిపుర, తాటిగూడ, చిల్కూరి లక్ష్మినగర్, జీఎస్ ఎస్టేట్, అనుకుంట పార్ట్, ఖోజా కాలనీ, కుమ్మరికుంట, గాంధీనగర్, మహాలక్ష్మివాడ ఇటీవల నీట మునిగాయి.

ఇది జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీ. దస్నాపూర్ వ