
రైతులందరికీ పంట బీమా కల్పించాలి
ఆదిలాబాద్: రైతులందరికీ పంట బీమా కల్పించా లని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసా యం చేసే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తే ఎటూ సరిపోదన్నారు. నష్టపోయిన రైతులందరికీ విత్తనాలు సబ్సిడీపై అందించాలన్నారు. అలాగే కోతకు గురైన భూములను చదును చేసుకునేందు కు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, జోగు రవి, మటోలియా, సంతోష్, రాకేష్, దయాకర్, శ్రీనివాస్ తదితరులున్నారు.