
ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: దివ్యాంగులు ఉపకరణాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ క ల్యాణ మండపంలో ఆలింకో, విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు మంగళవారం నిర్ధారణ శిబిరం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలింకో సంస్థ 18ఏళ్లలోపు దివ్యాంగుల కు అవసరమైన పరికరాలు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంస్థ ప్ర తినిధులు దివ్యాంగుల నుంచి కొలతలు తీసుకున్నారు. అవసరమైన పరికరాలు త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. ఇందులో ఆదిలా బాద్‌అర్బన్ ఎంఈవో సోమయ్య, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.