
దగ్గు.. జ్వరం.. నొప్పులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రోగాలు ముసురుకుంటున్నాయి.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సీజ నల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ఇంటికి వెళ్లి నా ఒకరిద్దరు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా బాధపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తోపాటు ప్రైవేట్, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రిమ్స్‌లో మంగళవారం ఓపీ విభాగంలో 2400 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పిడి యా ట్రిక్ వార్డులో సరిపడా బెడ్లు లేక ఒక్కో పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స అందించారు.
కిక్కిరిసిపోయిన పిడియాట్రిక్ వార్డు..
రిమ్స్‌లోని పిడియాట్రిక్ వార్డు చిన్నారులతో కిక్కిరిసిపోయింది. ఇటీవల బెడ్లన్నీ ఖాళీగా ఉండగా, వారం నుంచి నిండిపోయి కనిపిస్తున్నాయి. ఈ వా ర్డులో 70 బెడ్లు ఉండగా, 90 మంది వరకు చికిత్స పొందుతున్నారు. డెంగీ లక్షణాలు, టైఫాయిడ్, వైర ల్ జ్వరాలతో బాధపడుతున్నారు. సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్యులు ఒక్కో పడకపై ఇద్దరేసి చిన్నారులకు సేవలు అందిస్తున్నారు.
జ్వరాలతో విలవిల..
జిల్లాలో సీజనల్‌వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీ వల కురిసిన వర్షాలతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో దోమలు, ఈగలు, కలు షిత నీటి కారణంగా జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా టైఫాయిడ్, వైరల్ జ్వ రాలున్నాయి. జిల్లాలో ఈ నెలలో 19 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 50నమోదయ్యాయి. రిమ్స్‌తోపాటు ప్రైవేట్ ఆస్పత్రులూ రోగులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా కొంత మంది అందినకాడికి దండుకుంటున్నారు. అవసరం లేకు న్నా వైద్యులు టెస్టుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
పారిశుధ్య నిర్వహణ లోపంతోనే...
ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో పరి సరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.గుంతలు, మురుగుకాలువలతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో అందులో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. ఫలితంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది.
ఓపీ పెరిగింది..
రిమ్స్‌లో ఓపీ పెరిగింది. మంగళవారం 2400 మంది జ్వరాలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యసేవలు పొందారు. పిల్లల వార్డులో 90 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. ఈ వార్డులో అదనంగా మరో 20 బెడ్లు ఏర్పాటు చేశాం. అలాగే 200 మంది చిన్నారులు ఓపీ ద్వారా చికిత్స పొందారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్
శుభ్రత పాటించాలి..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలి. నిల్వ నీటిలో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతాయి. వాటి నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. జ్వరాల బారిన పడిన వారు సమీపంలోని
ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో

దగ్గు.. జ్వరం.. నొప్పులు