
● ‘మహాలక్ష్మి, గృహజ్యోతి’ నమోదుకు అర్హుల ఆసక్తి ● సందడి
‘సంక్షేమ’ లబ్ధికి ఆరాటం
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటికోసం గతంలో ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసి ఉండి ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారంతా ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారి వివరాల సేకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటీవల వరుస సెలవులు రావడంతో దరఖాస్తుదారులు మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేషన్ కార్డులు పొందిన వారంతా సంక్షేమ పథకాల అమలు కోసం క్యూ కట్టారు. వారికి ఇబ్బందులు కలగకుండా బల్దియా అధికారులు అదనపు సిబ్బందిని నియమించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు సూచించారు.