
మహనీయుడు పాపన్నగౌడ్
ఆదిలాబాద్‌రూరల్: బహుజనుల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుడు సర్వాయి పాపన్నగౌడ్ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాపన్నగౌడ్ సేవలను కొని యాడారు. గౌడ కులస్తులకు చేయూత అందించాల నే లక్ష్యంతో వన మహోత్సవంలో భాగంగా ప్ర భుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అలాగే రాజీ వ్ యువ వికాసం పథకం కింద రూ.50వేల రుణంను వంద శాతం సబ్సిడీపై అందించేలా చర్యలు తీ సుకుంటున్నామని అన్నారు. ముందుగా గౌడ కులస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా రు. ఇందులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీని వాస్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, గౌడ కులస్తులు రమేశ్‌గౌడ్, ది నేష్‌గౌడ్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.