
నిందితుడి ఆచూకీ తెలిపితే నజరానా
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 8న ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సునీల్‌కుమార్, నాగరాజుతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి ఆమె మృతి కారణమైన నిందితుడు స్థానిక రైల్వేస్టేషన్ గుండా పర్లి వైద్యనాథ్ ట్రైన్‌లో పరారైన విషయం సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడి ఎత్తు దాదాపు 5.4 అడుగులు ఉంటుందని, మరాఠీ భాష మాట్లాడే వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలిస్తే ఆదిలాబాద్ డీఎస్పీని 87126 59914, ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐని 87126 59918, టూ టౌన్ సీఐని 8712659920, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను 87126 59965 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమాచారం తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణలలో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు.