● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ
వాగులో కొట్టుకుపోతున్న వాహనం
కైలాస్‌నగర్: జిల్లాలో వర్షం దంచికొట్టింది. శనివా రం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లా యి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునగగా.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరడంతో జలకళ సంతరించుకున్నా యి. లోలెవల్ వంతెనలపై వరద ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలి చిపోయా యి. పలుచోట్ల పంట చేలు ముంపునకు గురయ్యా యి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
పలు కాలనీలు జలమయం
జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్, దుర్గానగర్, గ్రీన్‌సిటీ, కృష్ణానగర్‌లోని లోలెవల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీఎస్ ఎస్టేట్‌లోకి వర్షపునీరు చేరి చిన్నపాటి చెరువును తలపించింది. భాగ్యనగర్, మహాలక్ష్మివాడ కాలనీల్లోకి వర్షపునీరు చెరడంతో సామగ్రి అంతా తడిసిపోయింది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గానగర్ వాగు ఉ ప్పొంగి ప్రవహించడంతో కోజాకాలనీలో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది. తాంసి మండలంలో ని హస్నాపూర్, బోథ్ మండలంలోని సాయినగర్ కాలనీ, బేలలోని పాతబస్తీ, ఇందిరానగర్‌కాలనీలను వరద ముంచెత్తింది.