
తాంసీలో అత్యధికం.. గాదిగూడలో అత్యల్పం
వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఇదే భారీ వర్షం. శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక్క రోజే జిల్లాలో 2078.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాంసి మండలంలో 170.6 మి.మీ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇక తలమడుగులో 162.4, మావలలో 154.2, గుడిహత్నూర్‌లో 145.2, సిరికొండలో 144.4, ఆది లాబాద్ అర్బన్‌లో 142.0, ఇంద్రవెల్లిలో 135.2, జైనథ్‌లో 132.6, ఆదిలాబాద్ రూరల్‌లో 126.0, ఇచ్చోడలో 123.2, నేరడిగొండలో 91, బజార్‌హత్నూర్‌లో 89.2, భీంపూర్‌లో 88.8 మి.మీ, బోథ్‌లో 85.6, నార్నూర్‌లో 84.8, బేలలో 78.4, ఉట్నూర్‌లో 64.2, గాదిగూడలో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తాంసీలో అత్యధికం.. గాదిగూడలో అత్యల్పం