
అత్యవసరమా.. డయల్ చేయండి
కై లాస్‌నగర్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సాయం అందించేందు కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్‌రూం నంబర్ 1800 425 1939, ఆదిలాబాద్ మున్సిపల్‌లోని కంట్రోల్ రూం నంబర్ 94921 64153 ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కంట్రోల్ రూంలో ఒక్కో షిఫ్ట్‌లో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తక్షణ సాయం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వర్షం తగ్గే వరకు తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ సహాయ కేంద్రాల నుంచి అందించే సమాచారం, సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.