
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
పలువురిని కాపాడిన రెస్క్యూటీమ్
7
జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర బేస్‌బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
సాత్నాల: భారీ వర్షాలతో సాత్నాల ప్రాజెక్టుకు వరద ఒక్కసారిగా పెరి గింది. 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా .. నాలుగు గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 1.24 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు పేర్నొన్నారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాంసి: మత్తడివాగు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడంతో శనివారం ఉదయం ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో 39,116 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 42,860 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా 277.20 మీటర్ల వద్ద స్థిరంగా ఉండేలా ఔట్‌ఫ్లో కొనసాగిస్తున్నట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు.

క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి

క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి

క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి