
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల సమీపంలోగల మసీదు ఎదురుగా నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని శుక్రవారం వేకువజామున నిర్మల్ నుంచి మెట్‌పల్లి వైపు అరటిపండ్ల లోడుతో వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో గద్దె కూలి స్తంభం కిందపడింది. డీసీఎం వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.