
జిల్లా పోలీసులకు సేవా పతకాలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకు చెందిన ఇద్దరు కాని స్టేబుళ్లకు రాష్ట్ర సేవా పతకాలు లభించాయి. టీజీ ఎఫ్‌టీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న వీరు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, డీజీ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కాయకార్ సంజయ్, ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన గటిక రాజు పతకాలు అందుకోవడంపై పలువురు వారికి అభినందనలు తెలిపారు.
సేవా పతకాలు అందుకుంటున్న కానిస్టేబుళ్లు

జిల్లా పోలీసులకు సేవా పతకాలు