
యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు శుక్రవారం కలిసి విన్నవించారు. పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయనకు జిల్లా కేంద్రంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష మేరకు జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లాలో ఎక్కడ యూనివర్సిటీ కావాలని అడగగా, జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం జిల్లా కేంద్రంలోనే అనువుగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమితి కన్వీనర్ పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఈ విషయమై సలహాదారు కలెక్టర్ ను ఆరా తీయగా, విషయం తన దృష్టిలో ఉందని పేర్కొన్నారని సమితి సభ్యులు తెలిపారు. ఇందులో సమితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సవీన్‌రెడ్డి, డాక్టర్ నరేందర్‌రెడ్డి, సతీ్‌శ్ సతీశ్‌రెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.