
అసెంబ్లీలో ప్రస్తావించాలి
నేరడిగొండ: జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పా టు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా చైర్మన్ రాథోడ్ సందీప్ విన్నవించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో నేరడిగొండ మండల చైర్మన్ నర్సింగ్ దాస్, వైస్ చైర్మన్ సతీష్, కోఆర్డినేటర్ కృష్ణ, విలేజ్ కమ్యూనిటీ మెంబర్స్ కృష్ణ, సంతోష్ తదితరులున్నారు.