
రాజీవ్ సద్భావన యాత్రకు వీడ్కోలు
కై లాస్‌నగర్: రాజీవ్ సద్భావన యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మన్ ఆర్.దొరై ఆధ్వర్యంలో ఈ నెల 9న తమిళనాడులోని పెరంబుదూర్‌లో మొదలైన యాత్ర ఈనెల 19న దేశ రాజధానిలోని న్యూఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సమాధి వీర్ భూమికి చేరుకుంటుంది. ఈ యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో యాత్రీకులు రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం క్యాంపు ఆఫీస్ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పా ల్గొన్నారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరా వు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు జ్యోతిని దర్శించుకుని వీడ్కోలు పలికారు. 33 ఏళ్లుగా యాత్ర కొనసాగించడం అభినందనీయమని సోయం బాపూరావు కొనియడారు. నాయకులు పాల్గొన్నారు.