రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్‌ విద్యార్థి విషాదం! | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్‌ విద్యార్థి విషాదం!

Aug 4 2024 11:54 PM | Updated on Aug 5 2024 11:29 AM

-

ఆదిలాబాద్‌: దహెగాం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై కందూరి రాజు కథనం ప్రకారం.. కుంచవెల్లికి చెందిన చిప్ప సూరజ్‌కు ఎలక్ట్రికల్‌ షాపు ఉంది. చౌదరి నవీన్‌ (17)తో కలిసి సామగ్రి కొనుగోలు కోసం బైక్‌పై కాగజ్‌నగర్‌కు వెళ్లారు.

తిరిగివస్తుండగా మండల కేంద్రం మల్లన్న ఒర్రె సమీపంలోని కల్వర్టు వద్ద ఆగి ఉన్న మరో బైక్‌ను అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రైతుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులో కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ చౌదరి నవీన్‌ మృతి చెందాడు. నవీన్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి చౌదరి తిరుపతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement