'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం! | - | Sakshi
Sakshi News home page

'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!

Nov 3 2023 2:12 AM | Updated on Nov 3 2023 10:30 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జైనథ్‌ మండలంలోని భోరజ్‌ గ్రామానికి చెందిన రమాకాంత్‌(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమాకాంత్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం భోరజ్‌ గ్రామానికి వెళ్లే రోడ్డుపై శవమై కనిపించాడు.

గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించి 108కు ఫోన్‌ చేశారు. అప్పటికే అతడు మృతి చెందడంతో 108 తిరిగి వెళ్లిపోయింది. మృతదేహాన్ని ఆటోలో రిమ్స్‌కి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌లో దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు నర్సింగ్‌, చంద్రభాగ వేడుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా..

Advertisement
 
Advertisement
Advertisement