Telangana Crime News: మనోవేదనకు గురై.. 'వీఆర్‌ఏ' మృతి!
Sakshi News home page

మనోవేదనకు గురై.. 'వీఆర్‌ఏ' మృతి!

Sep 6 2023 12:50 AM | Updated on Sep 6 2023 8:16 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: వీఆర్‌ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే.. పెంబి తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహించిన ఇటిక్యాల్‌ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆయిండ్ల బుచ్చన్న సర్దుబాటులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో రికార్డు అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన నాటి నుంచి దివ్యాంగుడైన బుచ్చన్న ఇంత దూరం బదిలీ చేశారని మనోవేదనకు గురికావడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో 15 రోజుల క్రితం నిజామాబాద్‌ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బీపీ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement