కేసులు ఎత్తి వేయాలి | - | Sakshi
Sakshi News home page

కేసులు ఎత్తి వేయాలి

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

ఉట్నూర్‌రూరల్‌: గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్‌ రాందాస్‌ నాయక్‌పై ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన అక్రమ కేసు వెంటనే ఎత్తి వేయాలని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటాద్రి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌ నగర్‌ పాత ఉట్నూర్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ, రౌండ్‌ టేబుల్‌ సమావే శం నిర్వహించి మాట్లాడారు. హక్కుల సాధన కు పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చే స్తున్న రాందాస్‌ నాయక్‌పై కేసులు పెట్టడం స రికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజని ర్ధారణ కమిటీ విచారణ జరపగా, ఆయనపై పె ట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని రౌండ్‌ టే బుల్‌ డిమాండ్‌ చేసింది. న్యాయవాది జగన్‌నా యక్‌, అఖిల భారత రైతు కూలీ సంఘం సర్దార్‌, గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లా అ ధ్యక్షుడు కుటికల శంకర్‌, ఓపీడీఆర్‌ ఉమ్మడి జి ల్లా అధ్యక్షుడు మహేందర్‌, వివిధ సంఘాల నాయకులు జాడి వెంకటేశ్‌ నేత, వినోద్‌కుమార్‌, గణేశ్‌, ఎల్లయ్య, శంబాజీ, మున్నయ్య, ధర్మం పటేల్‌, చంద్రయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement