ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● ఘనంగా ఆదివాసీ దినోత్సవం ● నృత్యం చేసి ఆకట్టుకున్న కలెక్టర్‌, ఎస్పీ

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదివాసీ సంస్కృతి, సంప్రదా యాలను పరిరక్షించి ముందు తరాలకు అందించా లని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. ప్రపంచ ఆ దివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న హీరా సుకా దేవస్థానం ఆవరణలో వేడుకలు నిర్వహించా రు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎస్పీ అఖిల్‌ మహాజ న్‌, అదనపు కలెక్టర్‌ రాయిసిడాం చిత్రుతో కలిసి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీలు ముందుగా వీరికి డోలు, వాయిద్యాలతో ఘనస్వాగ తం పలికారు. అనంతరం సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. కుమురం భీం, రాంజీగోండ్‌ విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆది వాసీ జెండా ఆవిష్కరించారు. ఆదివాసీలతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆది వాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని చె ప్పారు. హీరా సుకా దేవస్థానం ఆవరణలో షెడ్డు ని ర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పా రు. మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, నిర్వహణ కమిటీ సభ్యులు టేకం శ్యామ్‌, ఆత్రం రాహుల్‌, మడావి దిగంభర్‌, సెడ్మాకి సుభాష్‌, పెందూర్‌ దిలీ ప్‌, మెస్రం హరీశ్‌, గేడం దీపక్‌, మెస్రం దత్తు, కోవా మారుతి, గేడం సురేశ్‌, కుర్సేంగే తానాజీ, మెస్రం శంకర్‌, గేడం మాధవ్‌, మనోహర్‌, ఆనంద్‌రావ్‌, సంగీత, వనిత, గిరిజాబాయి తదితరులున్నారు.

ఆదివాసీ అమరులను గుర్తించాలి

ఆదివాసీ హక్కులతోపాటు స్వాతంత్య్రోద్యమంలో ముందుండి పోరాడి అనేక మంది ఆదివాసీలు అమరులయ్యారని, ఆదివాసీ దినోత్సవం రోజున వారిని గుర్తించాలని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు కోరారు. హీరా సుకా దేవస్థానం ఆవరణలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఆదివాసీ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అల్లూరి సంజీవ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చరణ్‌గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంతన్‌రావ్‌, నాయకులు మంగేశ్‌, ప్రణిత, ఖిజర్‌ పాషా, నహీద్‌, బద్దం పోతారెడ్డి, సామ రూపేశ్‌రెడ్డి, దౌలత్‌రావ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement