కై లాస్‌నగర్: యువత సమస్యలపై గళం విప్పాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ సూచించా రు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూ త్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్‌గౌడ్ జెండా ఆవిష్కరించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేశ్ జాదవ్ మాట్లాడుతూ.. యువత సమస్యలపై పోరాడే వేదికగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే యువజన శక్తిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దే శంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డ్రగ్స్ లాంటి సమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రతీ గ్రామం, మండలంలో యువతతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కోసం ప్రభుత్వాలు, అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ భాగస్వాములు కా వాలని కోరారు. అనంతరం ఆ దిశగా ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు. మాజీ ఎంపీ సోయం బాపురావ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సామ రూపేశ్‌రెడ్డి తదితరులున్నారు.


