కై లాస్‌నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతతో పాటు అక్రమాలకు చెక్‌పెట్టేలా ప్రభుత్వం స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీకి నిర్ణయించింది. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా క్యూఆర్ కోడ్‌తో డె బిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగా కార్డులను ముద్రించింది. నెల క్రితమే కార్డులు జిల్లాకు చేరినా ప్రభుత్వం వాటి పంపిణీపై నిర్ణయం తీసుకోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15నుంచి వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కార్డులను మండలాల వారీగా తరలించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల చేతుల మీ దుగా లబ్ధిదారులకు కార్డులు అందించనున్నారు.
12ఏళ్ల తర్వాత కొత్త కార్డులు
గతంలో దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి తెలుపు రంగు, దారిద్య్రరేఖకు ఎగువనున్న వారికి గులాబీ రంగు రేషన్‌కార్డులుండేవి. వాటిపై సీఎం ఫొటోతోపాటు లబ్ధిదారు ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు ముద్రించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రేషన్‌కార్డులు ముద్రించలేదు. నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. దాని ఆధారంగా ఆన్‌లైన్‌లో కుటుంబ సభ్యుల వివరాలతో కూడి న ఆహారభద్రత ప్రతుల ఆధారంగా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసింది. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం మాత్రమే అందిస్తుండటంతో ఏపీఎల్ (గులాబీ) కార్డులను పూర్తిగా రద్దు చేసింది. తాజాగా నూతన కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంపరింగ్‌కు అవకాశం లేని పీవీసీ స్మార్ట్ కార్డులు ముద్రించింది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో పా టు కుటుంబ సభ్యుల వివరా లు పొందుపర్చా రు. ఏటీఎం కా ర్డుల తరహాలో ఉన్న వీటిని పీవోఎస్ యంత్రాలపై స్కా న్ చేసి లబ్ధి దారులకు బి య్యం పంపి ణీ చేయనున్న ట్లు అధికారులు చెబుతున్నారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయ డం ద్వారా కార్డుదారు కుటుంబ సభ్యుల సమాచారం కనిపించనుంది.
కలెక్టర్‌కు పంపిణీ బాధ్యతలు
స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్‌కు అప్పగించింది. జిల్లా పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో లబ్ధిదారులకు పకడ్బందీగా పంపిణీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో జిల్లాకు చేరిన కార్డులను మండలాల వారీగా సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా వాటి పంపిణీపై చర్యలు చేపట్టనున్నారు. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని మధ్యాహ్నం 2గంటలకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులు పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు రేషన్‌కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏళ్ల నిరీక్షణ తర్వాత కార్డులు అందిస్తుండడంతో కొత్తగా కార్డు పొందనున్న లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


