అనారోగ్యంతో రిజర్వుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో రిజర్వుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి

Sep 3 2023 12:49 AM | Updated on Sep 3 2023 9:24 AM

- - Sakshi

నేరడిగొండ: టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌ రిజర్వుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కటక్వాల్‌ నారాయణ్‌ సింగ్‌ (59) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆయన కుటుంబీకులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఇంటికి తీసుకురాగా మృతిచెందాడు. శనివారం మండల కేంద్రంలో టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌ ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

కమాండెంట్‌లు ఆయన పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని బోథ్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌ జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, సర్పంచ్‌ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్‌ దేవేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి, వీడీసీ చైర్మన్‌ రవిందర్‌రెడ్డి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement