నిర్మల్‌ గడ్డపైనే స్వరాష్ట్ర కాంక్ష | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ గడ్డపైనే స్వరాష్ట్ర కాంక్ష

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

30ఏళ్ల క్రితం ఇక్కడే మాటిచ్చిన కేసీఆర్‌

ప్రాజెక్టులను చూసి చలించి పోరాడిన నేత

జిల్లాతోపాటు మెడికల్‌ కాలేజీ మంజూరు

బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు.. తెస్తలేరు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రైతుగర్జన సభ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో జోష్‌

మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నిర్మల్‌/నిర్మల్‌టౌన్‌:‘నిర్మల్‌ మాములు జిల్లా కా దు.. చదువులతల్లి సరస్వతీదేవి కొలువున్న పుణ్య భూమి. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పెయింటింగ్స్‌, కొ య్యబొమ్మలను తయారు చేసే కళాకారులతో వర్ధి ల్లే ధన్యభూమి. ఈ చారిత్రక నేలకు కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన స్వరాష్ట్ర పోరాటానికి అవినాభావ సంబంధం ఉంది..’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రె సిడెంట్‌ కేటీఆర్‌ జిల్లాతో కేసీఆర్‌కు, తెలంగాణ పో రాటానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయ న మాట్లాడారు. ‘సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1996లో ని ర్మల్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. అప్పు డు మంత్రిగా ఉన్న కేసీఆర్‌ ఉపఎన్ని క ఇన్‌చార్జిగా నిర్మల్‌కు వచ్చారు. ఆ సమయంలో కొందరు సన్ని హితులతో సమీపంలోని పోచంపాడ్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వెళ్లారు. అక్కడ గేట్లకు గ్రీస్‌ లేదు, ఆయిలింగ్‌ లేదు, చిలుము పట్టి అనాథగా మారినట్లున్న ఆ ప్రాజెక్టును చూసి చలించిపోయా రు. తనకు భగవంతుడు శక్తినిస్తే తెలంగాణ కోసం పోరాడుతాన ని, ఈ ప్రాజెక్టులతో మన ప్రాంతానికి మంచిరోజు లు తీసుకువస్తానని ఇదే గడ్డపై కంకణం కట్టుకున్నా రు..’ అని గుర్తుచేశారు. ఇక్కడి ప్రాంతంతో ఉన్న అ నుబంధం, అభివృద్ధి చేయాలన్న తపనతోనే నిర్మల్‌ జిల్లాను ఏర్పాటు చేశారని, మెడికల్‌ కాలేజీనీ ఇచ్చారని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా జిల్లాలోనూ ఎన్నో చెరువుల్లో పూడిక తీయించి మహర్దశ పట్టించారన్నారు. చుట్టూ ప్రాజెక్టులు, చెరువులు ఉంటే నిర్మల్‌ ప్రాంతానికి ఎందుకు కరువు వచ్చిందో ఇక్కడి రైతులే ఆలోచించాలని అన్నారు.

బీజేపీపై విమర్శలు..

తెలంగాణలో ఓట్లు కావాలి, తెలంగాణలో సీట్లు కావాలి.. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే సోయి లేదని కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు చోటు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్‌ విసిరారు. మూడేళ్లలో బీజేపీతో తెలంగాణకు ఒక్క పనైనా జరిగిందా? బీజేపీ ఎంపీని, బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే నిర్మల్‌ జిల్లాకు ఏమైనా మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేస్తుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడటం లేదు.. నిర్మల్‌ జిల్లాకు రావాల్సిన నవోదయ విద్యాలయం కూడా రాలేదన్నారు. ఓట్లు తొలగిస్తున్నారని దేశమంతా గగ్గోలు పెడుతుంటే, నిర్మల్‌లో మాత్రం ఎన్నికల సంఘానికి మద్దతుగా బీజేపీ ర్యాలీ తీయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

సభ సక్సెస్‌.. బీఆర్‌ఎస్‌లో జోష్‌

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో గులాబీ శ్రేణుల్లో రైతుగర్జన సభ జోష్‌ నింపింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు పక్కనున్న బాల్కొండ, బోథ్‌, ఆదిలాబాద్‌, మెట్‌పల్లి నియోజకవర్గాల నుంచీ భారీగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చాయి. ఎన్టీఆర్‌ మినీస్టేడియం మొత్తం నిండిపోవడంతోపాటు రోడ్లపైనా బారులుదీరారు. ఇందులో చాలామంది మహిళలు, రైతులు ఉండటంపై పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. నిర్మల్‌ నియోజవర్గ ఇన్‌చార్జి కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి అధ్యక్షత వహించగా, ఇటీవల పార్టీలో చేరిన నల్ల వినయ్‌రెడ్డిని కేటీఆర్‌ పరిచయం చేశారు. సభలో ముందుగా రాంకిషన్‌రెడ్డి, ఖానాపూర్‌ నియోజవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా వారెవరూ మాట్లాడలేదు. ముధోల్‌ నేతల పేర్లను కేటీఆర్‌ పలికినప్పటికీ వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. తన ప్రసంగంలో కేటీఆర్‌ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిపై విమర్శలు చేశారు. గతంలో పార్టీ వైభవాన్ని పేర్కొన్నా మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌పై ఎలాంటి ఆరోపణలు చేయకపోవడంపై సభలో చర్చించుకున్నారు.

నీళ్లను లిఫ్ట్‌ చేసి ఉంటే..

శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లోకి పునరుజ్జీవ పథకం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం గోదావరి నీళ్లను లిఫ్ట్‌ చేసి ఉంటే ఇవాళ జిల్లాలో నీళ్ల జాతర సాగుతుండేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. మన ఎస్సారెస్పీ ఎందుకు ఎండిపోయింది? ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు ఎందుకు నిండాయి? కుప్పానికి చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే, గోదావరి పక్కనే ఉన్న నిర్మల్‌ జిల్లాలో ఎందుకు కరువు వచ్చింది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 2023లో తాను ప్రారంభించిన 27ప్యాకేజీకి ముందుకు తీసుకువెళ్లలేదని విమర్శించారు. జిల్లాలోనూ 63 వేలమంది బీడీ కార్మికులకు పెన్షన్లు అందించిన ఏకై క నాయకుడు కేసీఆర్‌ అన్నారు. 2017లో బీడీ పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రభుత్వం జీఎస్టీ విధిస్తే, దాన్ని అడ్డుకున్న నాయకుడూ ఆయనేనని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement