కై లాస్‌నగర్: భారత తొలి విద్యాశాఖ మంత్రిగా ఆధునిక విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన దార్శనికుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రు అన్నారు. ఆ మహనీ యు ని జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, పలువురు అధికారులు, మైనా ర్టీ ప్రతినిధులతో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మైనా ర్టీల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషిచేసిన ఆదర్శమూర్తి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం తదితరులు పాల్గొన్నారు.


