breaking news
Spurious liquor
-
మారాల్సింది బాలయ్య ఫోకస్!
అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి. కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలయ్య ఫోకస్ మారాలిహిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు. ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.జోరుగా.. హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్‌ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్‌లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా
రాష్ట్రంలో రోజూ లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం మార్కెట్లోకి చేరుతోంది. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం ఉంది. లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ల బెల్ట్ దుకాణాల్లో, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో నకిలీ మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఇంత వ్యవస్థీకృత పద్ధతిలో తయారు చేయడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ అంతా వాళ్ల ఆధీనంలోనే నడుస్తోంది. ఇంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సొంతం. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నకిలీ మద్యం తయారు చేస్తూనే ఉన్నారు. డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయట పడడంతో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. చేసేది ఆయనే, నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేదీ ఆయనే.. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియా.. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఇదే మోడస్ ఆపరెండా వీళ్లది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ.. మీ జేబులు నింపుకోవడానికి దిగజారిపోయారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు కన్పిస్తున్నాయని ఎత్తి చూపారు. నకిలీ మద్యం తయారు చేసేది, సరఫరా చేసేది.. షాపులు, అక్రమ (ఇల్లీగల్) పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపుల్లో విక్రయించేది చంద్రబాబు మనుషులేనని.. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరన్నారు. వాటాల పంపిణీలో తేడా రావడంతోనే నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చిందన్నారు. ఈ తరహా వ్యవస్థీకృత నేరం చేయడం చంద్రబాబుకే సాధ్యమని.. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ దెప్పి పొడిచారు. నేరం చేసిన చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నింద మరొకరిపై వేస్తున్నారంటూ మండిపడ్డారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయిస్తే తమ మూలాలన్నీ బయట పడతాయనే భయంతోనే.. తన మాఫియాలో భాగస్వామి అయిన విజయవాడ సీపీ రాజశేఖర్ నేతృత్వంలోని సిట్ విచారణకు ఆదేశించారంటూ తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలను చూపుతూ నకిలీ మద్యం మాఫియా అరాచకాలను ఏకిపారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలే » రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ (ఇల్లిసిట్, స్పూరియస్) మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారు చేసి.. వాళ్ల మాఫియా లిక్కర్ షాపుల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. » ఈ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడుపుతున్న వారందరూ టీడీపీ వాళ్లే. ఈ ప్రైవేటు మాఫియా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది. వాళ్ల షాపుల ద్వారానే అమ్మకాలు సాగిస్తుంది. గ్రామాల్లో ఏకంగా వేలం వేసి బెల్ట్ షాపులు పెట్టి, వాటికి పోలీస్ రక్షణ ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు ఈ మాఫియా శ్రీకారం చుట్టింది. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా అనధికారిక పర్మిట్ రూమ్‌ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. » ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది ప్రభుత్వం. అధికార పార్టీ నాయకులు సొంత జేబులు నింపుకునేందుకు దిగజారిపోయారు. డబ్బుల కోసం నకిలీ మద్యం తయారు చేసి, విచ్చలవిడిగా విక్రయాలు చేస్తూ దొరికిపోయారు. నిత్యం మార్కెట్లోకి లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం » వాటాల్లో తేడా రావడంతో నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చింది. ఒక్క ములకలచెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. 30 క్యాన్లలో సిద్ధం చేసిన 1,050 లీటర్ల స్పిరిట్ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ల నకిలీ మద్యం మార్కెట్లోకి వచ్చేది. » అంతేకాదు.. ఏ పోలీస్ కమిషనర్ అయితే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడో, ఏ పోలీస్ కమిషనర్ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని వేధిస్తున్నాడో.. అదే విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయట పడింది. ఇబ్రహీంపట్నంలో దాదాపు 27,224 బాటిళ్లు దొరికాయి. » అనకాపల్లి జిల్లా పరవాడలో, అమలాపురంలో, పాలకొల్లులో, ఏలూరులో, రేపల్లెలో, నెల్లూరులో ఇదే మాదిరిగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేసి, వాళ్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ప్రైవేట్ మాఫియా మద్యం షాపుల్లోకి, బెల్ట్ షాపులకు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. సిట్ పేరుతో తప్పుడు విచారణ చంద్రబాబే నేరాలు చేస్తారు. అది బయట పడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. అంతా ఆర్కె్రస్టెటెడ్ (తానా తందానా)గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడం కోసం.. అబద్ధాన్ని వందసార్లు చెబుతారు. టాపిక్ డైవర్షన్‌లో భాగంగా ఎదుటి వారిపై బురదజల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ వారిని కూడా జైళ్లకు పంపిస్తారు. మాఫియాలోని వారంతా చంద్రబాబు మనుషులే » నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్, టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. చంద్రబాబు ఆయనకు బీ ఫామ్ ఇస్తున్న ఫొటోలో పక్కనే ఉన్న మరో వ్యక్తి జనార్దనరావు. లోకేశ్, చంద్రబాబుతో ఉన్న మరో వ్యక్తి సురేంద్రనాయుడు (ఫొటోలు చూపారు). ఇదంతా ఒక మాఫియా. » ఇదే జనార్దన్‌రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ వీళ్లే సుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. వాళ్లదంతా హాట్ లైన్ కదా! అంటే, ముందుగానే జనార్దన్‌రావుతో వీళ్లు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్‌రావు రెండున్నర సంవత్సరాల కిందట నుంచే ఈ వ్యవహారం జరుగుతోందని చెప్పడం పూర్తిగా ఒక స్కెచ్. » తంబళ్లపల్లెలో టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి మీద ఒక బ్రాండింగ్. ఆయన పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడట! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారట! ఈ బ్రాండింగ్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తానా తందానా అంటాయి. దీనిపై టీడీపీ నుంచి ట్వీట్ వస్తుంది. ఆ తర్వాత ఈ వ్యవహారానికి ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ బిల్డప్ ఇస్తారు. » అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరితెగించి, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్‌ను ఉపయోగించుకుని తన మాఫియాలోని వ్యక్తి జనార్దన్‌రావు ద్వారా వీడియో చేయించి, ఆ వీడియోలో జోగి రమేష్ పేరు చెప్పించి.. ఆ వాయిస్‌కు మరికొన్ని వక్రీకరణలు జోడించి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఏకంగా జనార్దన్‌రావు ఫోన్లో చాట్స్ పేరుతో జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నకిలీ మద్యం తయారు చేసి, సరఫరా చేస్తూ.. అమ్మకాలు సాగిస్తున్న వీళ్లే ఎదుటి వారిపై బురదజల్లుతూ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేస్తున్నారు. ఇవిగో ఆధారాలు.. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు » అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు ఫ్యాక్టరీలో లభ్యమైన నకిలీ మద్యం బాటిళ్లు (చూపారు) ఇవి. ఇక్కడ ఫ్యాక్టరీలో మెషీన్లకు పూజ చేసి మరీ నకిలీ మద్యం పకడ్బందీగా తయారు చేస్తున్నారు. బాటిళ్లు, స్టాంప్స్, లేబుళ్లు, ప్యాకింగ్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం మెటీరియల్ ఇది (చూపారు). » కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, ఇంకో బాటిల్‌కు లేబుల్ అంటించలేదు. ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్.. ఇది వాళ్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్. షాపులకు ఒకరు నాగేశ్వరరావు పేరు, ఇంకొకరు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటారు. » అనకాపల్లి జిల్లా పరవాడలో చిన్న సైజ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ. అవే స్టిక్కర్లు, లేబుళ్లు, బాటిళ్లతో తయారు చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము నకిలీ మద్యంలో కీలక సూత్రధారి. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు ఇలా అన్ని చోట్ల ఒకే రకమైన సీన్ కనిపిస్తోంది. ప్రతి చోటా నకిలీ మద్యం బాటిళ్లు, మెషీన్లు, కార్టన్లు, లేబుళ్లతో సహా దొరికాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాలుగైదు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు బాబూ..» నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఏయే షాపుల్లో గుర్తించారు? ఒక్కదానిలో కూడా తనఖీలు లేవు. ఎందుకంటే అన్నీ వాళ్ల షాపులే. పట్టుకుంటే అన్ని చోట్ల నకిలీ మద్యం దొరుకుతుందనే తనిఖీలు ఉండవు. » జనార్దన్‌రావు విదేశాల నుంచి దర్జాగా వచ్చాడు. అసలు జనార్దన్‌రావు అనే మనిషి వీడియోలో ఎలా మాట్లాడాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు? తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్‌రావు ఇవన్నీ ఎలా చేశాడు? ఆ ఫోన్ నుంచి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం ఎలా సాధ్యం? అవన్నీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం? » నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయట పడితే ఇవాల్టికి 20 రోజులైంది. ఇప్పటి వరకు మీ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసిన జయచంద్రారెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? అతని పాస్‌పోర్టు ఎందుకు సీజ్ చేయలేదు? అతను పెద్దిరెడ్డికి సన్నిహితుడు అయితే మీరు ఎందుకు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డిపై పోటీ పెట్టారు? జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్లో రాశాడు. ఆ రోజు చంద్రబాబుకు ఆఫ్రికా మూలాలు కనిపించ లేదా? టిష్యూ పేపర్‌కు తక్కువ.. బాత్రూమ్ పేపర్‌కు ఎక్కువైన ఈనాడుకు కనిపించలేదా? » పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్లకేం ఆఫ్రికా లింకులు లేవు కదా? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అనకాపల్లి పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ రుత్తల రాము స్పీకర్‌కు సన్నిహితుడు. రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా? అక్కడి నుంచి స్పిరిట్ వస్తోందా? వీళ్లు కొంటున్నారా? » ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. అతను మహిళలని కూడా చూడకుండా అధికారుల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని కూడా పోతాడు. అంత గొప్ప నాయకుడు దగ్గరుండి లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. మరో పేకాట కింగ్ రేపల్లె నుంచి డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటుంటాడు. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది మీ (చంద్రబాబు) మనుషులు కాదా? వాటిని షాపులకు సరఫరా చేసి విక్రయాలు చేస్తోందీ మీ వాళ్లు కాదా? ఇది దొంగ చేతికి తాళం ఇవ్వడం కాదా? మద్యం విక్రయాల సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నవన్నీ టీడీపీ నాయకులవే కదా.. పర్మిట్ రూమ్‌లలో లూజ్ లిక్కర్ విక్రయించేది వాళ్లే. నకిలీ లిక్కర్ దందా మొత్తం వాళ్ల కార్యకర్తలదే. ఇదంతా సిండికేట్ మాఫియా కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే బాధ్యతలు వాళ్లకే ఇస్తున్నాడు. అంటే దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అన్నమాట. పభ్రుత్వం అమ్మే మద్యంలో 40 శాతం బెల్ట్ షాపుల ద్వారా, మరో 40 శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెట్టి గ్లాసుల్లో పోసి తాగిస్తున్నారు. ఎమ్మార్పీ రేటు గాలికెగిరిపోయింది. ఏం పోస్తున్నారో, ఏం తాగుతున్నారో అర్థం కాదు. మూడో రౌండ్ నాలుగో రౌండ్ కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో తెలియదు. ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని నకిలీ లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనేక్యూ ఆర్ కోడ్ వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. లాభాపేక్ష అప్పటి మా ప్రభుత్వానికి లేదు. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. మద్యం షాపుల సంఖ్య తగ్గించాం. మద్యం షాపుల వేళలు కూడా కుదించాం. పర్మిట్ రూమ్‌లు ఎత్తేశాం. పారదర్శక వ్యవస్థ కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకొచ్చాం. ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసి అమ్మేవాళ్లం. ఎంప్యానల్డ్ డిస్టిలరీల నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంప్యానెల్డ్ డిస్టిలరీలు కూడా గతంలో చంద్రబాబు అనుమతులిచ్చినవే. రూ.వందల కోట్లు ఖర్చు చేసి డిస్టిలరీలు పెడితే వాటిలో నాణ్యమైన మద్యం తయారు చేస్తారు. ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వమే అమ్మితే, మద్యం ప్రియుల ఆరోగ్యానికి కొద్దొగొప్పో గ్యారెంటీ ఉండేది. కానీ ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు. ఒకవైపున ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువగా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్మడం కళ్లముందే కనిపిస్తోంది. మరోవైపు నకిలీ, కల్తీ మద్యాన్ని తాగిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన వాటికి మాత్రమే గవర్నమెంట్‌కి డబ్బులు కట్టి సప్లై చేస్తున్నారు. జోగి రమేష్ ను ఇరికించే కుట్ర నకిలీ మద్యం కుంభకోణం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు మా నాయకుడు జోగి రమేష్‌పై ఆరోపణలు చేశారు. పన్నెండేళ్ల కిందట ఎప్పుడో దిగిన ఫొటోను చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు జనార్దన్‌రావుతో సత్సంబంధాలు లేవని, తన ఫోన్ చెక్ చేసుకోమని జోగి రమేష్ చాలెంజ్ చేస్తున్నాడు. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా.. ఫోన్ పోయిందని చెబుతున్న జనార్దన్‌రావు ఫోన్ నుంచి చాటింగ్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చాట్స్‌ను కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. జోగి రమేష్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే జనార్దన్‌రావు ఫోన్ పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ లేదు కదా అని చెబుతున్నారు. కానీ ఈ లోపల డైవర్షన్ పాలిటిక్స్‌లో డ్యామేజ్ చేసేది చేస్తున్నారు కదా. ఇది వ్యక్తిత్వ హననం కాదా? నువ్వు చేసింది ఒక వెధవ పని. ఆ వెధవ పనిలో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకో మనిషి మీద అభాండాలు వేయడం, లేని ఆధారాలు పుట్టించడం అన్యాయం కాదా? మొన్న అక్రమ లిక్కర్ కేసులో ఒకర్ని ఇరికించేందుకు వీళ్ల డబ్బులు రూ.11 కోట్లు తీసుకునిపోయి అక్కడ పెట్టి స్కాం జరిగిందని ప్రచారం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ నోట్ల మీద ఉన్న నెంబర్ల ఆధారంగా ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారు అనేది తెప్పించమని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఆర్బీఐకి లేఖ రాశారు. ఆ తర్వాత ఇక మాటల్లేవ్. ఎక్కడైనా రూ.11 కోట్ల డబ్బులు దొరికితే పక్కన పెడతారు. వీళ్లు మిగతా డబ్బుతో కలిపేశామని చెప్పారు. అలా ఎలా కలిపేస్తారు? అంటే, వీరే డబ్బులు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కాలేజీ డొనేషన్ల డబ్బు అని బయట పడుతుందనే భయంతోనే దాన్ని కలిపేశారు. చంద్రబాబుకి సిగ్గూలజ్జా లేదు. సిగ్గన్నా ఉంటే కొంచెం సిగ్గుపడతాడని అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం అషేమ్డ్గా ఫీలవుతాడనుకో వచ్చు. కానీ అషేమ్డ్గా ఫీలయ్యేది లేదు. సిగ్గు అంతకన్నా లేదు. -
నకిలీ మద్యం..‘కూటమి’ పతనం తథ్యం
సాక్షి, అమరావతి : నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొనడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టిన పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాయి. సర్కారు తీరును నిరసిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నిచోట్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నకిలీ మద్యం.. ప్రభుత్వ పతనం తథ్యం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నినదించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావును అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకునే యత్నం చేయగా, వారు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు వెంటనే రాష్ట్రంలో వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టి పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐతో దర్యాప్తు జరపడంతోపాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొంది. వైన్‌షాప్‌ల కేటాయింపులో అక్రమాలు గుర్తించి అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మద్యం విక్రయ వేళలు తగ్గించాలని.. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నేతలు నినదించారు. నారావారి ‘సారా పాలన’.. నశించాలి బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కుపై చేపట్టిన ఆందోళనలకు భారీ స్పందన లభించింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని నకిలీ మద్యంపై అనంతపురంలో నిర్వహించిన రణభేరిలో వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుబట్టాయి. నకిలీ మద్యంపై కర్నూలులో పెద్ద ఎత్తున పోరుబాట నిర్వహించారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ఆందోళనలు కొనసాగించారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారావారి సారాపాలన.. నశించాలి, నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి సర్కారు, ఎన్ బ్రాండ్ నకిలీ మద్యంతో జనం బలి, నకిలీ మద్యం మరణాలు.. పవన్‌కు కనపడవా? బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు.. అంటూ ప్లకార్డులతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనల్లో పాల్గొని నినదించారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు పచ్చజెండా ఊపి నకిలీ మద్యంతో కూటమి సర్కారు ప్రాణాలు హరిస్తోందని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామంలో బెల్ట్‌షాపు రూ.9 లక్షలు పలికిందంటే కూటమి సర్కారు పాలనలో ఎలా ఏరులై పారుతోందో ఊహించవచ్చని ప్రజాసంఘాలు, మహిళలు మండిపడ్డాయి. -
నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ రణభేరి
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, దానిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తారు.నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్టుచేయాలని.. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేయనున్నారు. నకిలీ, కల్తీ మద్యంవల్ల చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరనున్నారు.ఇక వైన్‌షాప్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దుచేసేలా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సిఫార్సు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తారు. -
నకిలీ మద్యం వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు దానినుంచి బయటపడేందుకు అరెస్టయిన వారు కోవర్ట్‌లు అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో లింకులున్నాయని, కోవర్ట్‌గా తమ పారీ్టలో చేరాడంటూ సీఎం చంద్రబాబు అనడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.దొరికిన దొంగలకు వైఎస్సార్సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసి, తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నకిలీ మద్యం మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం, విలేకరులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని మీడియా గొంతు నొక్కేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నకిలీ మద్యం మాఫియా బయటపడిందని, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఆధారాలతో సహా రుజువైందని చెప్పారు.సీఎం సొంత జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం తయారు చేసి అసలు మద్యం మాదిరిగా మార్కెట్లోకి తీసుకువచ్చారన్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్రధారి దాసరిపల్లె జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుని తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారన్నారు. ఈ నిందితుల్లో జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, జనార్దన్ తదితరులు చంద్రబాబు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితులే అన్నారు.ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ నకిలీ మద్యం వ్యవహారం నుంచి టీడీపీని ఎలా కాపాడాలా అని మధనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ‘సాక్షి’ పత్రిక విలేకరులపై, యాజమాన్యంపై రెండు కేసులు పెట్టారన్నారు. ‘సాక్షి’ విలేకరి ఇంట్లోకి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు హంగామా సృష్టించారని, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని వార్త రాసినందుకు విలేకరిపై జులుం ప్రదర్శించారని పేర్కొన్నారు. -
నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు
కడప కార్పొరేషన్/ఏలూరు టౌన్: నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు కదం తొక్కారు. ఎన్–బ్రాండ్ లిక్కర్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కడపలోని ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం పారబోసి నిరసన తెలిపారు. అనంతరం అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ ప్రజలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, నకిలీ మద్యం ఎక్కడపడితే అక్కడే దొరుకుతోందన్నారు. ఇప్పటికే నకిలీ మద్యానికి నలుగురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధ్యులైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, వీధివీధిలో బెల్టు షాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మండిపడ్డారు. ఏలూరు న్యూ అశోక్‌నగర్‌లోని ఎక్సైజ్ శాఖ డీసీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్సీపీ మహిళా నేతలతో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు ఫ్లెక్సీకి మద్యంతో అభిõÙకం చేసి నినాదాలు చేశారు. -
పక్కావ్యూహం ప్రకారమే..!
రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్ రూమ్‌లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాప్‌లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్‌కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్యాదవ్లను సైతం పక్కనపెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని శంకర్‌యాదవ్ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది. అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్.. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చారు. టీడీపీ సిండికేట్ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్‌కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ ముఖ్యనేత టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు. పచ్చ సీసాలో నకిలీ మద్యం కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్వర్క్ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. మోగుతున్న మరణమృదంగం... టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తనిఖీలు, దాడులు చేసింది. ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్‌గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్‌గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది. స్పిరిట్ .. మనుషులకు ప్రాణాంతకం!వాస్తవానికి ఈ స్పిరిట్‌లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్‌ను బాగా పలుచన (డైల్యూట్) చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గిస్తాయి. తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర కారమిల్ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్ దుకాణాలు, 3,736 పర్మిట్ రూమ్‌లు, 75 వేల బెల్ట్ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. -
అందరి కళ్లకు గంతలు కట్టి.. కొండను కొల్లగొట్టి..
బి.కొత్తకోట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు శాండ్, ల్యాండ్, మైన్, వైన్ లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అడ్డదారుల్లో వీటి ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి వ్యూహ రచన చేశారని మరోమారు స్పష్టమైంది. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడికక్కడ మాఫియా ముఠాలుగా మారి ఇసుక దందాకు తెర లేపిన విషయం తెలిసిందే. ఇక భూ దందాలు, పందేరాల గురించి చెప్పనలవికాదు. మొన్నటికి మొన్న అన్నమయ్య జిల్లా ములకలచెరువులో భారీగా ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్ బట్టబయలైంది. రోజూ వేల లీటర్ల నకిలీ మద్యం.. వివిధ బ్రాండ్ల పేరుతో తయారు చేసి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బెల్ట్ షాపులకు సరఫరా చేశారని నిగ్గు తేలింది. అందుకు సంబంధించిన యంత్ర సామగ్రి, కెమికల్స్, బాటిళ్లు, మూతలు, లేబుళ్లు పట్టుబడటం తెలిసిందే. ఈ దందాకు కింది స్థాయిలో పాత్రధారి తంబళ్లపల్లి టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి అని బయటకు పొక్కడంతో ఉలిక్కి పడిన సర్కారు పెద్దలు ఆయనపై హుటాహుటిన సస్పెన్షన్ వేటు వేశారు. అసలైన సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రాకుండా కట్టడి చేస్తున్నట్లు నిన్న, మొన్న జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పై స్థాయిలో ప్రభుత్వ పెద్దల భరోసా ఉండబట్టే ఇంత భారీ స్థాయిలో లిక్కర్ దందా సాగుతోందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల అండతో ఇదే జయచంద్రారెడ్డి బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట పంచాయతీలోని యాదలగుట్ట వద్ద పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేసిన విషయం తాజాగా కలకలం రేపుతోంది. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలైన నేపథ్యంలో స్థానికులు కొందరు ఈ భూ ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించి, వారి సూచనల మేరకు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించారు. ఐదెకరాల్లో స్టోన్ క్రషర్ యంత్రాలను అక్రమంగా ఏర్పాటు చేసింది నిజమేనని, మరో ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణా నిజమేనని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పై నుంచి వచ్చి న ఆదేశాల మేరకు స్టోన్ క్రషర్లు, కంకర, భవనాలను సీజ్ చేస్తున్నట్లు మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రకటించారు. ఫిర్యాదు నేపథ్యంలో హఠాత్తుగా తనిఖీలు » తుమ్మనంగుట్ట పంచాయతీ టోల్‌గేటు వద్ద యాదలగుట్టపై ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో ఎనిమిది నెలల క్రితం స్టోన్ క్రషర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి మరో ఐదు ఎకరాలు ఆక్రమించారు. భారీ యంత్రాలతో పనులు చేయించి నివాస భవనాలను సైతం నిర్మిoచారు. ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు మట్టి రోడ్డు కూడా వేసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా, ఇన్నాళ్లూ ఏ శాఖ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు. » వాస్తవానికి అక్రమ స్టోన్ క్రషర్‌పై ఫిర్యాదు రావడంతో బుధవారం మైనింగ్ శాఖ మల్లగుల్లాలు పడింది. తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చి.. తర్వాత దాడులు చేయడమే శ్రేయస్కరం అన్న నిర్ణయానికి వచ్చి ంది. పై నుంచి వచ్చి న ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు బి.కొత్తకోట, ములకలచెరువు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మైనింగ్ ఏడీ రంగకుమార్, తహసీల్దార్లు బావాజాన్, శ్రీనివాసులు, ఆర్ఐలు, సర్వేయర్లు, వీఆర్ఓలు, ఎస్ఐలు, పోలీసులు యాదలగుట్టకు చేరుకున్నారు. » రాత్రి 10.30 గంటలకు మొదలైన తనిఖీలు తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి రెవెన్యూ తరఫున భూ కేటాయింపు లేకపోయినా ఐదెకరాలకుపైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, అందులో భవనాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, స్టోన్ క్రషర్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని నిర్ధారించారు. » మైనింగ్ శాఖ నుంచి క్వారీ నిర్వహణ, స్టోన్ క్రషర్ నడుపుకునేందుకు ఎలాంటి అనుమతి లేనందున వాటిని సీజ్ చేశారు. 6,415 క్యూబిక్ మీటర్ల.. 40, 20, 6, 5 ఎంఎం కంకరను సీజ్ చేశారు. దాంతో పాటే రెండు పొక్లెయినర్లు, ఒక డోజర్, ఒక వాటర్ ట్యాంకర్, స్టోన్ క్రషర్‌ను సీజ్ చేశామని మైనింగ్ ఏడీ రంగకుమార్, బి.కొత్తకోట తహసీల్దార్ ఎ.బావాజాన్ ప్రకటించారు.అక్రమ దందాకు దర్జాగా విద్యుత్ లైన్ » జయచంద్రారెడ్డి అక్రమ స్టోన్ క్రషర్కు ఒక్క అనుమతి లేకపోయినా డిస్కం అధికారులు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక లైను ఏర్పాటు చేయడంపై విస్తుగొలుపుతోంది. గంటకు 300 టన్నులకుపైగా కంకరను కొట్టే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. » అక్రమ స్టోన్ క్రషర్ కోసం సమీపంలోని కొండను పగలగొట్టిన ప్రదేశాన్ని ఇన్స్పెక్టర్ పి.విజయకుమారి, మైనింగ్ సర్వేయర్ మాధవీలత, రెవెన్యూ సర్వేయర్ ముబారక్‌లు గురువారం పరిశీలించారు. ఎంత మేరకు రాళ్లను ఉపయోగించారనే దానిపై సర్వే చేస్తున్నారు. మొత్తంగా పది ఎకరాలు ఆక్రమించారని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. » స్టోన్ క్రషర్ ఏర్పాటుకు 14 శాఖల అనుమతులు అవసరం. ఈ అనుమతులు లేకుండా మైనింగ్ శాఖ అనుమతి ఇవ్వదు. క్వారీ అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ ఇస్తే దానికి అనుమతి ఇవ్వాల్సింది మైనింగ్ శాఖ. భూమి సొంతమా, లీజునా, ఏ సామర్థ్యంతో స్టోన్ క్రషర్ ఏర్పాటు చేస్తున్నారు.. అగ్నిమాపక, అటవీ, రెవెన్యూ, విద్యుత్, గ్రామ పంచాయతీ, ప్రజల నుంచి ఎన్వోసీ, రైల్వే, హైవే, పొల్యూషన్, కార్మిక శాఖ, ఇలా పలు శాఖల నుంచి ఎన్ఓసీలు, అనుమతులు పొందాక వాటిని పరిశీలించి మైనింగ్ శాఖ చివరగా అనుమతి ఇస్తుంది. ఇక్కడ ఇవేవీ లేకుండానే భారీ స్థాయిలో క్రషర్ కొనసాగిందంటే ప్రభుత్వ పెద్దల అందడండలు లేకుండా సాధ్యం కాదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
నకిలీ మద్యం తాగి ఒకరి మృతి
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో ఓ వైన్ షాపు వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న (39) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్‌లో బండలపై కూర్చొని కొద్ది కొద్దిగా తాగుతుండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి చిన్న పెద్దక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ సీఐ మనోహర్ చెప్పారు. మద్యం తాగిన వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయాడని తోటి మందుబాబులు, స్థానికులు వైన్ షాపు సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం తాగడానికి ఏర్పాటు చేసిన బండలను పగులగొట్టారు. కాగా, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టయిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
Bihar: కల్తీ మద్యంతో 20 మంది మృతి!
పాట్నా: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కాటేసింది. మోతిహారీ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొందరి పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు 20 మంది మరణించగా.. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధం విధించింది. అయినప్పటికీ కల్తీ మద్యాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఘటనపై సీఎం నితీశ్ స్పందించారు. ఘటన బాధాకరమన్న ఆయన.. విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో కూడా సివాన్‌లో కల్తీమద్యం సేవించి నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి అక్రమంగా ఆల్కహాల్ విక్రయించిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లిక్కర్ మాఫియా.. శానిటైజర్ తయారు చేస్తామని చెప్పి కోల్‌కతా నుంచి ఇథేనాల్ తీసుకొచ్చి మద్యం తయారు చేస్తోందని పోలీసులు తెలిపారు. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్సైజ్ శాఖ 15 మంది లిక్కర్ వ్యాపారులను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది బిహార్‌లోని ఛప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా ఏకంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాగా.. కల్తీమద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాగితే చస్తారని, మద్యం జోలికి వెళ్లొద్దని కరాకండీగా చెప్పారు. చదవండి: అసద్ అంత్యక్రియలు పూర్తి.. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ -
హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు..
పాట్నా: 72 మంది చనిపోయన బిహార్ కల్తీ మద్యం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు హోమియోపతి మందులను ఉపయోగించి విషపూరిత లిక్కర్‌ను తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో తేలింది. ప్రధాన సూత్రదారి సహా మొత్తం ఐదుగుర్ని సిట్ పోలీసు బృందం శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడు రాజేశ్ సింగ్ సహా శైలేంద్ర రాయ్, సోనుకుమార్, అర్జున్ మహ్తో, సంజయ్ మహ్తో ఉన్నారు. వీరంతా చాలా కాలంగా కల్తీమద్యం దందా నడుపుతున్నారు. ముఖ్యంగా రాజేశ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి 90 శాతం ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందులను భారీగా కొనుగోలు చేసి, వాటిని కల్తీ మద్యం తయారీకి ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. నకిలీ కస్టమర్ల పేర్లను ఉపయోగించి మందులను తీసుకొచ్చాడని వెల్లడించారు. ఈ కల్తీమద్యాన్ని తాగి నిందితుల్లోనే ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పోలీసులు వివరించారు. కల్తీమద్యం సరఫరా కేసులో రాజేశ్ గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. బిహార్ ఛప్రా జిల్లాలో కల్తీమద్యం తాగి వారాల వ్యవధిలోనే 72 మంది చనిపోయారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. సీఎం నితీశ్ కుమార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీమద్యం తాగి చనిపోయిన వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని నితీశ్ తేల్చిచెప్పారు. తాగితే చస్తారని ప్రజలను హెచ్చరించారు. చదవండి: శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. 8 మంది భక్తులు దుర్మరణం -
కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. మరో 10మందికి అస్వస్థత
గాంధీనగర్: కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో సోమవారం జరిగింది. సుమారు 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ‘కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. మరో 10 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. స్థానిక పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. రోజిడ్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంత మంది ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయమే ఇద్దరు మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి రోజిడ్ గ్రామంలో నాటు సారా తాగిన తర్వాత తన భర్త అనారోగ్యానికి గురైనట్లు ఓ మహిళ.. పోలీసులకు తెలిపింది. మరోవైపు.. ఆదివారం రాత్రి ఓ కొట్టులో నాటు సారా కొనుగోలు చేసిన తర్వాత సుమారు 25 మందికిపైగా అనారోగ్యానికి గురైనట్లు ఓ బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బొటాడ్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు భవనగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ యాదవ్. డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుజరాత్ పర్యాటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నాటు సారా అమ్ముతున్నట్లు ఆరోపించారు. ఇదీ చదవండి: గంజాయి తాగాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఉచిత సలహా! -
కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 20 మందికి అస్వస్థత
కోల్‌కతా: కల్తీ మద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో జరిగింది. ఈ సంఘటనలో మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాటు సారా తాగటం వల్లే వారు మృతి చెందినట్లు బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాత్రి నాటు సార తాగిన క్రమంలో పలువురు అస్వస్థతకు గురైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొందరు వాంతులు చేసుకున్నారని, అందులో కొందరు తీవ్రంగా ప్రభావితమై ఇంటిలోనే ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. అనారోగ్యానికి గురైన వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తర్వాత అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. ఇదీ చూడండి: షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్! -
దారుణం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం అమరీందర్ సింగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మృతులంతా అమృత్సర్, గురుదాస్‌పూర్, టార్న్ తరన్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రం కల్తీ మద్యం తాగి అమృత్‌సర్‌లోని తార్సిక్కా మండలం ముచ్చల్, టాంగ్రా గ్రామాలకు చెందిన ఐదుగురు మొదట మరణించినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు. అదే రోజు రాత్రి ముచ్చల్ గ్రామంలో మరో ఇద్దరు మరణించారని డీజీపీ చెప్పారు. టార్న్ తరన్‌లో నాలుగు, బటాలాలో ఐదు మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 24కు చేరిందని వెల్లడించారు. సీఎం ఆదేశం మేరకు ఈ కేసును డివిజనల్ కమిషన్ జలంధర్‌తో పాటు పంజాబ్ జాయింట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషన్ సంబంధిత జిల్లాల ఎస్పీలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కల్తీ మద్యం సేవించి పది మంది మృతి
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని రామ్‌నగర్ ప్రాంతంలో కల్లీ మద్యం సేవించిన ఘటనలో దాదాపు పది మంది మరణించారు. రామ్‌నగర్‌లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మరణించారని, మంగళవారం ఉదయం మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించగా, వారిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారని పోలీసులు తెలిపారు. కల్తీ మద్యం సేవించి అస్వస్ధతకు గురైన వారిలో మరో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉందని, తొమ్మిది మందిని లక్నోకు తరలించామని పోలీసులు వెల్లడించారు. కాగా విధి నిర్వహణలో విఫలమైన జిల్లా ఎక్సైజ్ అధికారిపై ఎక్సైజ్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు యూపీ డీజీపీ రంగంలోకి దిగి రామ్‌నగర్ ఎస్హెచ్ఓ రాజేష్, సర్కిల్ ఆఫీసర్ పవన్ గౌతమ్‌లను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని యూపీ ఎక్సైజ్ మంత్రి జై ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. -
ఈ108 మంది చావుకు ఎవరు బాధ్యులు!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘అవును! ఇంతటి విషాధానికి ఆదిత్యనాథ్ యోగియే బాధ్యత వహించాలి. ఇది గత ప్రభుత్వం హయాంలో జరిగి ఉంటే అది సమాజ్‌వాది పార్టీ బాధ్యతగా మేము కచ్చితంగా భావించేవాళ్లం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? వారి ప్రభుత్వం ఆధ్వర్యంలోనేగదా, పోలీసు వ్యవస్థ ఉన్నది. పైగా ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక పోలీసులకు స్వేచ్ఛ పెరిగింది. పోలీసుల అండదండలతోనే గదా! ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య కల్తీ మద్యం ఏరులై పారుతోంది’ అని కల్తీ మద్యం కారణంగా ధరమ్ పాల్ అనే 51 ఏళ్ల సోదరుడిని, సోను అనే 30 ఏళ్ల మేనల్లుడిని కోల్పోయిన శివపూర్ రైతు సుధీర్ కుమార్ మీడియాతో వ్యాఖ్యానించారు. చెవిటి, మూగ అయిన సోను దినసరి కూలి అని, మతిస్థిమితం లేని ఆయన తల్లిదండ్రులు ఆయనపైనే ఆధారపడి బతుకుతున్నారని స్థానికులు తెలిపారు. ‘అక్రమ మద్యం వ్యాపారులను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి విషాధ సంఘటనలకు తెరపడదు. పలానా, పలానా ముఠాలు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాయని నేను స్వయంగా మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ విషయం కల్తీ వ్యాపారులకు తెలిసి పోయింది. వారు పలుసార్లు నాకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించారు. అప్పటి నుంచి నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా మానేశాను’ అని సహ్రాన్‌పూర్‌లో మద్యం ‘డీఅడిక్షన్’ కేంద్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మమత ఆరోపించారు. మంగళవారం ఉదయం ధన్పాల్ సింగ్ మరణంతో కల్తీ మద్యం దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 108కి చేరుకుంది. 48 ఏళ్ల ధన్పాల్ సింగ్ దినసరి కూలి. ఆయన శవానికి సహరాన్‌పూర్‌లోని సేత్ బల్దేవ్ దాస్ బజోరియా జిల్లా ఆస్పత్రిలో అటాప్సీ నిర్వహించిన తర్వాత ఆస్పత్రి వర్గాల నుంచి ఆయన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా ఆయన బంధువులు పోలీసులను ప్రాధేయపడ్డారు. ‘మీ ఒక్క శవమే కాదు, బోలెడు శవాలు ఉన్నాయి. అప్పగించడానికి ముందు బోలెడంతా తతంగం ఉంటుంది’ అని పోలీసు అధికారులు బంధువులపై విసుక్కున్నారు. ధన్పాల్ శవాన్ని పోలీసు వ్యాన్ ఎక్కించారు. ‘నా అన్న చావుకు పోలీసులు, అధికార యంత్రాంగం కారణం కాకపోతే, ఎవరు కారణం?’ అంటూ ధన్పాల్ సింగ్ తమ్ముడు రాకేశ్ సింగ్ అడిగిన ప్రశ్న ఒక్క మీడియా తప్పించి ఎవరు వినిపించుకోలేదు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలోని బలుపూర్ గ్రామంలో ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన ఓ ఇంటిలో జరిగిన 13వ రోజు కర్మ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు కల్తీ మద్యం సేవించారు. కల్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులతో వారంతా బాధపడ్డారు. వారిలో సకాలంలో ఆస్పత్రిలో చేరి బతికిన వాళ్లు తక్కువ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవానాన్ని అడ్డుకోలేక పోయింది. ఢిల్లీ, గుజరాత్ తరహాలో కల్తీ మద్యం వ్యాపారులకు మరణ శిక్ష విధించేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017, డిసెంబర్లో ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అయినా ఫలితం లేదు. 2018, జనవరి బారబంకిలో కల్తీ మద్యానికి 11 మంది మరణించారు. గత మే నెలలో కాన్పూర్‌లో కల్తీ మద్యానికి పది మంది మరణించిన నేపథ్యంలో వినయ్ సింగ్ అనే వ్యక్తి గిడ్డంగి మీద పోలీసులు దాడిచేయగా, కల్తీ మద్యం సరకులు దొరికాయి. ఆయన సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ మంత్రి రామ్ స్వరూప్ సింగ్ గౌర్‌కు మనవడని తేలింది. వినయ్ సింగ్ సోదరుడు నీరజ్ 2017లో అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా కల్తీ మద్యం సరఫరా చేసే ముఠాలు మారుతాయి తప్ప మద్యం అక్రమ వ్యాపారం ఆగిన దాఖలాలు లేవని ప్రజలు చెబుతున్నారు. -
యూపీలో నకిలీ మద్యానికి 44 మంది బలి
-
నకిలీ మద్యానికి 34 మంది బలి
డెహ్రాడూన్/సహరాన్పూర్: నకిలీ మద్యం తాగిన కారణంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో శుక్రవారం 34 మంది మరణించారు. మరో 44 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఎక్సైజ్, పోలీస్ శాఖలకు చెందిన 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ కూడా 10 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. అంతకుముందు మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్ జిల్లాలో గత మూడు రోజుల్లో 8 మంది మరణించారు. వీరి మృతికి కూడా నకిలీ మద్యమే కారణమని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రెండు ఘటనలపై శాఖా పరమైన విచారణకు ఆదేశించడంతోపాటు మృతులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా రూర్కీ సమీపంలోని బలూపూర్ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాక 13వ రోజైన గురువారం సాయంత్రం పెద్ద కర్మను నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన భోజనంలో భాగంగా దాదాపు 78 మంది కల్తీ సారా సేవించారని ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతి భద్రతలు) అశోక్ కుమార్ చెప్పారు. బలూపూర్, సమీప గ్రామాలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లా సహరాన్‌పూర్‌కు చెందిన బంధువులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. నకిలీ మద్యం తాగి చనిపోయిన వారిలో 16 మంది బలూపూర్ లేదా సమీప గ్రామాలకు చెందినవారు కాగా, 18 మంది సహరాన్పూర్ జిల్లా వాసులు. మిగిలిన 44 మంది చికిత్స పొందుతున్నారు. సహరాన్‌పూర్‌కు చెందిన వారంతా తమ ఇళ్లకు చేరాక ఉత్తరప్రదేశ్‌లోనే మరణించినట్లు ఆ జిల్లా ఎస్ఎస్పీ దినేశ్ వెల్లడించారు. ఒక వ్యక్తి ఆ కల్తీ సారాను బలూపూర్ నుంచి తెచ్చి సహరాన్‌పూర్‌లో అమ్మినట్లుగా కూడా తెలుస్తోందన్నారు. -
నకిలీ మద్యం సేవించి ఏడుగురి మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. నకిలీ మద్యం సేవించి బుధవారం నదియా జిల్లాలో ఓ మహిళతో సహా ఏడుగురు వ్యక్తులు మరణించారు. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌధురిపురాలో ఈ ఘటన జరిగింది. నకిలీ మద్యం సేవించడంతోనే వారు మరణించారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతుండగా, మరణాలకు కారణమేంటన్న వివరాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయని నదియా జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటీవల నాటు సారా విక్రయించే చిన్న దుకాణాలు వెలిశాయని, వీటిలో మద్యం సేవించేందుకు ప్రజలు వీటి ముందు గుమికూడుతున్నారని స్ధానికులు తెలిపారు. చౌధురిపురాలో ఓ దుకాణంలో మద్యం సేవించిన కొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని, వారిని ఆస్పత్రికి తరలించగా నలుగురు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని స్ధానికులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారని చెప్పారు. మద్యం దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు పెద్దమొత్తంలో నాటు సారా, నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
కల్తీ మద్యానికి 17 మంది బలి
ఇటా: ఉత్తరప్రదేశ్ లో కల్తీ మద్యం 17 మందిని బలితీసుకుంది. మరో 12 మంది పరిస్థితి విషమంగా మార్చింది. ఇందులో ఆరుగురు తమ చూపును కోల్పోయారు. శనివారం ఉత్తరప్రదేశ్ లోని ఇటా జిల్లాలోని అలీగంజ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మృతులకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు జిల్లా మేజిస్టేట్ అజయ్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడైన శ్రీపల్ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
-
కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
హైదరాబాద్ : బెజవాడలో కల్తీ మద్యం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. విజయవాడ స్వర్ణ బార్లో మద్యం సేవించి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన సోమవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
81కి చేరిన కల్తీ సారా మృతులు
ముంబై: ముంబైలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 81కి పెరగగా, మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ఇంతమంది మరణించడం ఈ దశాబ్ధంలోనే రెండో సంఘటన. ఇంతకు ముందు 2004లో విక్రోలీలో కల్తీ సారా సేవించి 87 మంది మరణించారు. కల్తీ సారాకి బాధ్యులుగా భావిస్తున్న ప్రాన్సిస్ థామస్(46), సలీం మహబూబ్(39) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ సంఘటనలో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరింది. ముంబైలోని లక్ష్మీనగర్ మురికివాడలో బుధవారం రాత్రి కల్తీ సారా ఘటన వెలుగుచూసింది. కాగా కల్తీ సారాను అరికట్టడంతో విఫలమైన ఎనిమిది మంది పోలీసులను ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా సస్పెండ్ చేశారు. ఈ ఘటన పై ఇప్పటికే సీఎం ఫడ్నవిస్ దర్యాప్తుకు ఆదేశించారు. -
కూలీలను కాటేసిన కల్తీ మద్యం
-
25మందిని కాటేసిన కల్తీ మద్యం
ముంబయి: కాయాకష్టం చేసుకొని మురికి వాడల్లో బతికే అమాయక కూలీలను కల్తీమద్యం కాటేసింది. మత్తులో తూలడానికి తాగిన మద్యం వారి ప్రాణాలు తీసింది. ముంబయిలో కల్తీ మద్యం తాగి 25మంది ప్రాణాలు కోల్పోయారు. సుబర్బన్ మలాద్ వద్ద గల లక్ష్మీనగర్ మురికి వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరితోపాటు చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్య సహాయం పొందుతున్నారు. గత రాత్రి 7.30గంటల ప్రాంతంలో వారంతా మద్యం సేవించగా ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే పలువురు మరణించారు. వీరందరిని శాతాబాయి, బీఎంసీ తదితర ప్రముఖ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మద్యం షాపు నడుపుతున్న రాజు లంగడా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మద్యం సేవించి ఐదుగురి మృతి, నలుగురికి అస్వస్థత
ముంబై: కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతిచెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబై సమీపంలోని మల్వానీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మల్వానీలోని రాథోడ్ గ్రామంలో కొందరు వ్యక్తులు కల్తీ మద్యం సేవించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం మలాద్ లోని సురానా ఆస్పత్రికి, కందివాలిలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. -
మళ్లీ సిండి‘కేటు’
* పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం దిగుమతి *రాష్ట్రంలో మైనస్‌లోకి ఏపీబీసీఎల్ మద్యం విక్రయాలు *డీల్ కుదురుస్తున్న ప్రజా ప్రతినిధులు *నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకే ప్రమాదం *ఏసీబీకి సిఫారసు చేస్తామంటూ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైలవరం, అమలాపురం తరహా కల్తీ మద్యం సంఘటనలు మళ్లీ పునరావృతం కానున్నాయా? మద్యం తాగే అలవాటున్న ప్రజల ప్రాణాలు గాలిలో దీపమై ఊగుతున్నాయా? లిక్కర్ సిండికేటు ఒక్కసారిగా తెగబడిన తీరు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరికలు చూస్తుంటే ప్రజల ప్రాణాలకు మళ్లీ ముప్పు వచ్చిందని తెలుస్తోంది. ఏసీబీ దెబ్బకు 22 నెలల పాటు సెలైంట్‌గా ఉన్న లిక్కర్ సిండికేటు మళ్లీ జూలు విదిల్చడమే దీనికి కారణం. సిండికేటు దెబ్బతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా నకిలీ మద్యం పల్లెలకు చేరుతోంది. రెక్టిఫైడ్ స్పిరిట్‌తో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి గుప్పిస్తున్నారు. ఈ సిండికేటు దెబ్బకు రాష్ట్రంలో ఇంతకుముందెప్పుడూ లేనంతగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు మైనస్‌లోకి పడిపోయాయి. పాత కమిషనర్ సమీర్‌శర్మ బదిలీపై వెళ్లడం, కొత్త కమిషనర్ ఇంకా శాఖపై పట్టు సాధించకపోవడంతో సిండికేట్లు మళ్లీ పాత జమానా మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యవర్తులుగా ఉంటూ సిండికేట్ ‘డీల్’ కుదురుస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ ఏరియాల్లోని దుకాణాల్లో వాటాలు తీసుకొని అక్రమ దందాకు తెరలేపారు. వీళ్లకు స్థానిక ఎక్సైజ్ అధికారుల వత్తాసు ఉందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటుకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ ఇటీవల అధికారుల సమావేశం నిర్వహించి ఎస్‌హెచ్‌వో స్థాయిలో ఏదో జరుగుతుందని, అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే ఏసీబీకి సిఫారసు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం హడావుడిగా జిల్లాలు తిరుగుతూ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. పెరగాల్సిన విక్రయాలు తగ్గాయి! రాష్ట్రంలో నిరుపేద, సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే చవక, మధ్యతరహా బ్రాండ్ల మద్యం విక్రయాలు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం (ఎన్డీపీఎల్) దొంగచాటుగా దిగుమతి చేసుకొని వైన్‌షాపుల్లో పెట్టి అమ్మడం వల్లనే ప్రభుత్వ మద్యం విక్రయాలు తగ్గుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని కొంతమంది ముఠాగా ఏర్పడి పక్కరాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అధికారుల అంచనా మేరకైనా, గత రికార్డులను బట్టి చూసినా మద్యం విక్రయాలు ఏటా కనీసం 10 శాతం చొప్పున పెరగాలి. అందుకు తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్ బ్రివరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) వివిధ రకాల బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఎక్సైజ్ అధికారుల అంచనాల్లో గత పదేళ్లుగా తేడా రాలేదు. కానీ గడచిన 18 రోజులలో ఏపీబీసీఎల్లో మద్యం అమ్మకాల రేటు గణనీయంగా పడిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో కూడా విక్రయాల రేటు బాగానే ఉంది. మద్యం ధరలు రెండుసార్లు పెరిగినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. పై లీన్ తుపాను, సమైక్య ఉద్యమం జరిగిన సమయంలో కూడా మద్యం విక్రయాల రేటు పెరుగుతూనే వచ్చింది. కానీ ఎకై ్సజ్ కమిషనర్ సమీర్‌శర్మ మారిన తరువాత ఈ నెల మొదటి వారం నుంచీ అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా మైనస్‌లోకి పడిపోయాయి. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో మద్యం విక్రయాలు భారీగా తగ్గడం, మిగిలిన జిల్లాల్లో పెద్దగా మార్పు లేకపోవడం ఎన్డీపీఎల్ మద్యం దిగుమతిని నిర్ధారిస్తోంది. ఆ నాలుగు రాష్ట్రాల నుంచీ దిగుమతి.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒడిశా నుంచి.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తమిళనాడు నుంచి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి.. పశ్చిమగోదావరి జిల్లాకు గోవా నుంచి అక్రమంగా ఎన్డీపీఎల్ మద్యం రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్టిలరీల నుంచి వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లారీల ద్వారా ఇక్కడకు తరలిస్తున్నారు. మీడియం లిక్కర్‌ను కేసు (12 ఫుల్ బాటిల్స్) రూ.1,100 చొప్పున కొనుగోలు చేసి రాష్ట్రంలో రూ.4,200 చొప్పున అమ్ముతున్నారు. రోజుకు కనీసం 5 నుంచి 7 లారీల మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్లు అంచనా. చౌక మద్యంతో ప్రజల ఆరోగ్యానికి హాని ఉన్నా ఎక్సైజ్ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా చూస్తున్నారు.


